బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తరువాత మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఒక్కొక్కరి గురించి చాలా డీటైల్డ్ గా మాట్లాడారు నాగార్జున. బిందు మాధవి చాలా బాగా గేమ్ ఆడిందని పొగిడారు నాగార్జున. యాంకర్ శివపై పంచ్ లు వేశారు నాగ్. దాదాపు అందరి కంటెస్టెంట్స్ గేమ్ తీరుని కొనియాడారు నాగ్. ఆర్జే చైతుని గేమ్ కరెక్ట్ గా ఆడాలని సజెషన్ ఇచ్చారు. 
 
అనంతరం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి లాటరీ టికెట్స్ ఇచ్చారు. వాటిలో జాక్ పాట్ అని ఉంటే ఈ వారం సేఫ్ అవుతారని చెప్పారు. ఈ టాస్క్ లో అరియానాకు జాక్ పాట్ అని రావడంతో ఆమె సేఫ్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఆ తరువాత సరయు.. మళ్లీ ఒక వారానికే వెళ్లిపోతానేమోనని ఎమోషనల్ అయింది. గత సీజన్ లో ఆమె వచ్చిన మొదటివారానికే వెళ్లిపోయింది. ఈసారి కూడా అలానే జరుగుతుందేమోనని ఊహించుకొని ఎమోషనల్ అయింది. 
 
దీంతో ఆర్జే చైతు, అషురెడ్డి అందరూ కూడా ఆమెని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. మరి సరయు సేఫ్ అవుతుందో లేదో కాసేపట్లో తెలియనుంది. 

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:వారియర్స్:1. అషురెడ్డి (సీజన్ 3)2. మహేష్ విట్టా (సీజన్ 3)3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)4. అరియనా (సీజన్ 4)5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)6. తేజస్వి మదివాడ (సీజన్ 2)7. సరయు (సీజన్ 5)8. హమీద (సీజన్ 5)9. అఖిల్ సార్థక్ (సీజన్ 4) ఛాలెంజర్స్:1. ఆర్జే చైతు (ఆర్జే)2. అజయ్ కతుర్వర్ (నటుడు)3. స్రవంతి చొక్కారపు (యాంకర్)4. శ్రీరాపాక (నటి)5. అనిల్ రాథోడ్ (మోడల్)6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)

8. బిందు మాధవి (హీరోయిన్)