బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తరువాత మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఒక్కొక్కరి గురించి చాలా డీటైల్డ్ గా మాట్లాడారు నాగార్జున. బిందు మాధవి చాలా బాగా గేమ్ ఆడిందని పొగిడారు నాగార్జున. యాంకర్ శివపై పంచ్ లు వేశారు నాగ్. దాదాపు అందరి కంటెస్టెంట్స్ గేమ్ తీరుని కొనియాడారు నాగ్. ఆర్జే చైతుని గేమ్ కరెక్ట్ గా ఆడాలని సజెషన్ ఇచ్చారు. 


అనంతరం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అరియానా, నటరాజ్ మాస్టర్, హమీద సేఫ్ అయ్యారు. అయితే ఈ ప్రాసెస్ లో సరయు చాలా ఎమోషనల్ అయింది. తను ఇంకా సేఫ్ అవ్వకపోవడంతో తట్టుకోలేకపోయింది. దానికి తగ్గట్లే మరో టాస్క్ లో కూడా మిత్ర, చైతు సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఫైనల్ గా సరయు, ముమైత్ ఖాన్ నామినేషన్ లో మిగిలి ఉన్నారు. 


ఆ తరువాత ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య డాన్స్ కాంపిటిషన్ పెట్టారు. ఈ కాంపిటిషన్ లో వారియర్స్ గెలిచారు. అనంతరం నామినేషన్ లో ఉన్న సరయు, ముమైత్ లకు ఒక టాస్క్ పెట్టి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాకయ్యారు. సరయు తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. ముమైత్ తన ఎలిమినేషన్ ని ఊహించలేదు. దీంతో తనను రాంగ్ పోట్రే చేశారంటూ బాధపడింది ముమైత్. అఖిల్ ని పట్టుకొని ఏడ్చేసింది. 


స్టేజ్ పైకి వచ్చిన ముమైత్ ఎమోషల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. తనను అగ్రెసివ్ గా పోట్రే చేశారని.. తనను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కాలేదని చెప్పింది. ఆ తరువాత హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి తన ఒపీనియన్ చెప్పింది. ఈ క్రమంలో యాంకర్ శివ, బిందు, చైతుల బిహేవియర్ తనకు నచ్చలేదని చెప్పింది. వాళ్ల కారణంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.