బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss OTT) తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో కాసేపట్లో తెలియనుంది. ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున(Nagarjuna). ముందుగా హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున. 


ఆ తరువాత నామినేషన్ లో ఉన్న వారితో ఒక టాస్క్ ఆడించారు. ఇందులో అషురెడ్డి(Ashu Reddy), అఖిల్(Akhil) లకు సేఫ్ అని వచ్చింది. అనంతరం హౌస్ మేట్స్ తో రెడ్ రోజ్, బ్లాక్ రోజ్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఆ తరువాత నామినేషన్స్ లో మిగిలిన వారిని నుంచోమని చెప్పిన నాగార్జున.. చిలకజోస్యం టాస్క్ ఇచ్చారు. ఇందులో యాంకర్ శివ, అరియానా సేఫ్ అని అనౌన్స్ చేశారు. 


కాసేపు హౌస్ మేట్స్ తో గేమ్ కంటిన్యూ చేసిన నాగార్జున.. నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేయడానికి మరో టాస్క్ ఇచ్చారు. ఇందులో హమీద(Hamida), అనిల్(Anil) లకు సేఫ్ అని వచ్చింది. అనంతరం హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడదీసి వారితో డైలాగ్స్ గెస్ చేసే గేమ్ ఆడించారు. ఇందులో హౌస్ మేట్స్ అందరూ డాన్స్ లు చేసి ఎంజాయ్ చేశారు. ఆ తరువాత నామినేషన్ లో మిగిలిన ఐదుగురితో ఫొటో టాస్క్ ఆడించి మహేష్ విట్టా, సరయు సేఫ్ అని చెప్పారు. డేంజర్ జోన్ లో మిత్రా, శ్రీరాపాక, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. 


Also Read: అరియనా, శివ సేఫ్ - అందరూ టార్గెట్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయిన మిత్రా


Also Read: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ప్రధాని మోదీ మెచ్చిన సినిమా, అంతగా ఏముందంటే?