బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో సోమవారం నాడు నామినేషన్స్ మొదలయ్యాయి. నిజానికి ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేసేవారు. అయితే ఈసారి ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ముందుగా బిందు మాధవి.. అఖిల్, నటరాజ్, మిత్రాలను నామినేట్ చేసింది. 


ఎవరూ లేరనే అబద్ధపు ఇమేజ్ ని ఫామ్ చేసి ఇంతవరకు వచ్చిందని మిత్రాను నామినేట్ చేసింది బిందు. 'నేను ఒకటి మాట్లాడితే తాను ఇంకొకటి అన్ సింక్‌లో మాట్లాడుతుందని' అఖిల్ అంటే.. నీకు బుర్రలేదు కదా.. ఉంటే నీకు నేను మాట్లాడేది అర్ధమౌతుందని ఘాటు కామెంట్స్ చేసింది బిందు మాధవి. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయడంతో అతడు బిందుపై మండిపడ్డాడు. 


'బిందు వాళ్ల ఫాదర్ కి చెబుతున్నా.. ఈమెకి జ్ఞానాన్ని నేర్పించండి ప్లీజ్' అని కామెంట్ చేశాడు నటరాజ్ మాస్టర్. 'నా తండ్రిని గురించి మాట్లాడొద్దు..' అని సీరియస్ గా చెప్పింది బిందు. దీంతో నటరాజ్ మాస్టర్ మరింత రెచ్చిపోయారు. 'నేను నీలాగా దొంగమాటలు మాట్లాడను.. నీ యాటిట్యూడ్ నువ్వు.. ఒక తెలుగమ్మాయికి ఉండాల్సిన లక్షణమే లేదు' అని పెర్సనల్ ఎటాక్ చేశారు. 'నేను చాలా స్ట్రాంగ్‌ ఆడాను.. నీలా నేను బెడ్‌పై కూర్చుని కాళ్లు ఊపుతూ కూర్చోలేదు' అని బిందుపై ఫైర్ అవ్వగా.. ఆమె అతడి మీదకు వెళ్తూ 'గో..' అని అంది. దీంతో మాస్టర్ కూడా ఆమె మీదికి మీదికి వెళ్లడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.


అరియనా.. మిత్రాశర్మ, అనిల్, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేసింది. ఈ క్రమంలో మిత్రాశర్మకి, అరియనాకి మధ్య మాటల యుద్ధం జరిగింది. అలానే నటరాజ్, అరియానాల మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది. బాబా భాస్కర్, అరియనా, అఖిల్ లను నామినేట్ చేశాడు అనిల్. దీంతో వారు ముగ్గురూ అనిల్ తో ఆర్గ్యూ చేశారు. మిగిలిన నామినేషన్స్ రేపటికి కంటిన్యూ అవ్వనున్నాయి. 


Also Read: 'సర్కారు వారి పాట' సెన్సార్ రివ్యూ!


Also Read: 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తే' - 'మేజర్' ట్రైలర్ వేరే లెవెల్