Bigg Boss OTT Telugu: ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే?

సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈసారి లారీ, హారన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

Continues below advertisement

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. మూడో వారంలో ఊహించని విధంగా ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరిగిన వెంటనే.. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈసారి లారీ, హారన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఎవరైతే బజర్ మోగినప్పుడు హారన్ మోగిస్తారో.. వారికి ముందుగా నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది.

Continues below advertisement

 హారన్ మోగించినవారికి ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ గా నామినేట్ చేయాలనేది మాత్రం హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. బిందు తనను డిఫెండ్ చేసుకోవడం కోసం శివ ఎంత క్లోజ్ అయినా.. అతడిలో నెగెటివ్ పాయింట్స్ చెప్పింది. అలానే అనిల్ కూడా శివని టార్గెట్ చేశారు. 

బాడీ షేమింగ్ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అరియనా..  వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయుని నామినేట్ చేసింది. దీంతో సరయు.. ఇప్పుడు అరియానా ఎలా ఆడుతుందో అర్థమైదంటూ కౌంటర్ ఇచ్చింది. మహేష్ విట్టా తనను నామినేట్ చేయడంతో విసిగిపోయిన అరియనా.. తాను అసలు బాడీ షేమింగ్ చేయలేదంటూ చెప్పింది. ఇక ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు యాంకర్‌ శివ, బిందుమాధవి, అనిల్‌, అజయ్‌, సరయు, అరియానా, మిత్ర శర్మ. 

Also Read: సినిమా ఫ్లాప్ అని డైరెక్ట్ గా ప్రభాస్ కి చెప్పేసిన దిల్ రాజు

Continues below advertisement