Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. కిచెన్, వాష్ రూమ్, డైనింగ్ ఏరియా, బెడ్ రూమ్, హాల్, కన్ఫెషన్ రూమ్ ఇలా ఇంట్లో అన్ని రూమ్స్ ని చూపించారు. 

 

ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. ఐదో కంటెస్టెంట్ గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, నటి స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఆమె నాగార్జునతో మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అయింది. 

 

నాగార్జున ఆమెతో మాట్లాడుతూ.. ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పమని అడగ్గా.. తను రెండు సార్లు పెళ్లి చేసుకున్న విషయాన్ని బయటపెట్టింది స్రవంతి. తను ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్నానని.. ఆ తరువాత పెద్దవాళ్లు ఒప్పుకొని మళ్లీ పెళ్లి చేశారని చెప్పింది. స్టేజ్ పై స్రవంతి ఉండగా.. ఆమె భర్త, కొడుకు వీడియోను ప్లే చేశారు నాగార్జున. అది చూసిన స్రవంతి చాలా ఎగ్జైట్ అయింది. 

 





ఆరో కంటెస్టెంట్ గా ఆర్జే చైతు ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పటినుంచి చైతు పడిన కష్టాలను ఒక ఏవీలో చూపించారు. నాగార్జునతో మాట్లాడిన చైతు.. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు చెప్పారు. తరువాత అతడి తల్లి స్టేజ్ పైకి వచ్చింది. చైతుకి ఆల్ ది బెస్ట్ చెబుతూ హౌస్ లోకి పంపించారు.