Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. కిచెన్, వాష్ రూమ్, డైనింగ్ ఏరియా, బెడ్ రూమ్, హాల్, కన్ఫెషన్ రూమ్ ఇలా ఇంట్లో అన్ని రూమ్స్ ని చూపించారు. 


ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. మొదటి కంటెస్టెంట్ గా అషు రెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. 'ఊ అంటావా మావ..' సాంగ్ కి స్టెప్పులేసి అలరించింది. ఆ తరువాత నాగార్జునని హత్తుకొని ముద్దుపెట్టుకుంది. ఒక గులాబీ ఇచ్చి.. 'మీకు తెలియకుండానే నన్ను ఇన్స్పైర్ చేశారు' అని చెప్పింది. హౌస్ లోకి వెల్తూ.. ఈసారి పిచ్చెక్కిస్తా, అషు గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ చెప్పుకొచ్చింది. 


ఇక సెకండ్ కంటెస్టెంట్ గా మహేష్ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఆయన ఇదివరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. మరి ఈసారి తన గేమ్ తో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. అషు, మహేష్ విట్టా ఇద్దరూ కూడా మూడో సీజన్ లో పాల్గొన్నారు. 


ఇక 24 గంటలు చూడలేని వాళ్ల కోసం హాట్ స్టార్ లో ప్రతిరోజు ఓ గంట ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారు. నిజానికి ఈ గంటలోనే మొత్తమన్నీ కవర్ అయిపోతాయన్నమాట. ప్రతివారం ఎలిమినేషన్స్, నామినేషన్స్ అన్నీ కామనే. 24 గంటల ఈ షోని 84 రోజులు కంటిన్యూస్ గా ప్రసారం చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కాస్త పేరున్న వాళ్లు కావడంతో 84 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. 


షో మొత్తం సంగతేమో కానీ.. నాగార్జున హోస్ట్ చేసే రోజుల్లో మాత్రం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ముందురోజు షూటింగ్ చేయడం, దాన్ని ఎడిట్ చేసి స్ట్రీమింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. మరి ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారో..? కంటెస్టెంట్స్ లో చాలా మంది ఇదివరకు హౌస్ కి వెళ్లొచ్చిన వాళ్లే. వారికి అనుభవం ఉంది కాబట్టి ఈసారి మరింత దృష్టి పెట్టి గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ప్రేక్షకుల ఫోకస్ మాత్రం కొత్త వాళ్లపై పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. పాత కంటెస్టెంట్స్ గేమ్ తీరు ఆల్రెడీ చూశారు కాబట్టి కొత్తవాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.