Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. కిచెన్, వాష్ రూమ్, డైనింగ్ ఏరియా, బెడ్ రూమ్, హాల్, కన్ఫెషన్ రూమ్ ఇలా ఇంట్లో అన్ని రూమ్స్ ని చూపించారు.
ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. మూడో కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చింది. 'వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం' సాంగ్ కి డాన్స్ వేసింది ముమైత్ ఖాన్. ఆ తరువాత నాగార్జున మాట్లాడుతూ.. ముమైత్ తెలుగు భాష గురించి కామెంట్ చేశారు. ఆమెతో చిన్న టాస్క్ కూడా చేయించారు. ఈ సీజన్ కి గాను.. ముమైత్ డైనమైట్ లా పేలబోతుందని చెప్పారు. అనంతరం హౌస్ లోకి వెళ్లిన ముమైత్ అషు, మహేష్ విట్టాలను చూసి ఎగ్జైట్ అయింది.
నాల్గో కంటెస్టెంట్ గా నటుడు అజయ్ కతుర్వర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ యంగ్ స్టర్ 'మెహబూబా', 'రాగల 24 గంటల్లో' వంటి సినిమాల్లో నటించాడు. స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడిన అజయ్.. నాగ్ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అలానే పూరి జగన్నాధ్ తో తనకు మంచి బాండింగ్ ఉన్నట్లు చెప్పారు. ఆ తరువాత కొత్త కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అజయ్.