Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్.  

 

పద్నాలుగో కంటెస్టెంట్ గా యాంకర్ శివ స్టేజ్ పైకి వచ్చారు. ఈ షోకి రావడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చారు. అందరూ తనను సీరియస్ గానే చూస్తారని.. కానీ నమ్మితే చాలా బాగా ఉంటానని అన్నారు. తన చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నానని.. ఈ షో తనకు హెల్ప్ అవుతుందని అన్నారు. 





 

పదిహేనో కంటెస్టెంట్ గా నటి బిందు మాధవి ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ పై 'ఫుల్ కిక్కు' సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఆమె ఇదివరకు బిగ్ బాస్ తమిళంలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో అలరించనుంది. తమిళంలో ఛాన్స్ వచ్చినప్పుడు లవ్ ఫెయిల్యూర్ తో డిప్రెషన్ లో ఉన్నానని.. ఆ సమయంలోనే హౌస్ లోకి వెళ్లానని చెప్పింది. హౌస్ తనకు హీలింగ్ ప్రాసెస్ లా పనిచేసిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ లో కనిపించడం ఆనందంగా ఉందని చెప్పింది.