బిగ్ బాస్ ఓటీటీ తెలుగు పది వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. (యాంకర్ శివ, అరియనా, అషురెడ్డి, మిత్రాశర్మ, బిందు, అఖిల్, అనిల్). ఆదివారం నాడు వీరిలో ఒకరు ఎలిమినేట్ కానుండడంతో షోపై ఆసక్తి క్రియేట్ అయింది. ఎప్పటిలానే ఆదివారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. 


గత వారం హౌస్ మేట్స్ ఎలా ఆడారో కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం వారితో పలు గేమ్స్ ఆడించారు. బెస్ట్ పెర్ఫార్మర్, వరస్ట్ పెర్ఫార్మర్, టాస్క్ పెర్ఫార్మన్స్, వరస్ట్ ఎంటర్టైనర్ అని రాసి ఉన్న బోర్డుని హౌస్ మేట్స్ ముందుంచారు. ఒక్కో కంటెస్టెంట్ ను పిలుస్తూ.. వారి అభిప్రాయాలను అడిగారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్.. తాము ఎవరిని బెస్ట్, వరస్ట్ అని ఫీల్ అవుతున్నారో చెప్పారు. 


మధ్యమధ్యలో నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేస్తూ వచ్చారు. ముందుగా.. యాంకర్ శివ ఆ తరువాత మిత్రాలను సేవ్ చేశారు. అనంతరం మరో టాస్క్ ఆడించి అఖిల్ ని సేవ్ చేశారు. ఆ వెంటనే నామినేషన్స్ లో మిగిలిన అనిల్, అషురెడ్డి, అరియనా, బిందుల చేతుల్లో బాక్సులు పెట్టి రిబ్బన్ టాస్క్ ఇచ్చి.. బిందు సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఆ తరువాత కాసేపు గేమ్స్ కంటిన్యూ చేశారు నాగార్జున. 


అనంతరం మరో టాస్క్ లో అనిల్ ను సేవ్ చేశారు. ఫైనల్ గా అరియనా, అషురెడ్డి నామినేషన్స్ మిగిలారు. దీంతో వారిద్దరిలో టెన్షన్ మొదలైంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న బాబా భాస్కర్ ని ఎవరికోసమైనా.. పాస్ వాడతారా..? అని ప్రశ్నించారు నాగ్. కానీ ఆయన ఎవరికీ వినియోగించలేదు. దీంతో అషురెడ్డి, అరియనాలను బాబా భాస్కర్ ను ప్లీజ్ చేసుకోమని అడిగారు నాగ్. అరియనా తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వద్దని చెప్పింది. అషురెడ్డి అతడిని కన్విన్స్ చేసినా.. అతడు ఒప్పుకోలేదు. ఫైనల్ గా అరియనా, అషురెడ్డిలతో చిన్న టాస్క్ ఆడించి అషురెడ్డి ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ కాసేపు సైలెంట్ అయిపోయారు. స్టేజ్ పైకి వెళ్లిన అషురెడ్డి హౌస్ మేట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చింది.