Bigg Boss Non Stop Live Updates: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కంటెస్టెంట్లకు నచ్చిన, నచ్చని హౌస్ మేట్స్ వీరే!

‘బిగ్ బాస్’ హౌస్‌లో 3వ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? ఈ పేజ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 28 Feb 2022 01:22 PM
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కంటెస్టెంట్లకు నచ్చిన, నచ్చని హౌస్ మేట్స్ వీరే!

బిగ్ బాస్ టాస్క్ ప్రకారం.. మొత్తం కంటెస్టెంట్స్‌లో అధిక లైక్స్, డిస్‌లైక్స్ వచ్చింది వీరికే. అందరి కంటే అజయ్‌కు ఎక్కువ లైక్స్, శ్రీరాపాక, మిత్రకు అధిక ఎక్కువ అన్‌లైక్స్ వచ్చాయి. 


అజయ్ - (3 లైక్స్/0 డిస్ లైక్స్) అరియానా, అఖిల్, ముమైత్ ఖాన్ (థమ్స్ అప్)
శ్రీ రాపాక - (0/3) అరియానా, అఖిల్, ముమైత్ ఖాన్ (థమ్స్ డౌన్)
శివ - (2/0) సరయు, నటరాజ్ మాస్టార్ (థమ్స్ అప్) 
అనిల్ - (1/1) సరయు (థమ్స్ డౌన్), అషు రెడ్డి (థమ్స్ అప్)
మిత్ర - (1/3) అషు, మహేష్, తేజస్వి(థమ్స్ డౌన్) మిత్ర (థమ్స్ అప్)
చైతూ - (1/0) మహేష్ (థమ్స్ అప్)
స్రవంతి - (1/2) తేజస్వి (థమ్స్ అప్) హమీద, నటరాజ్ మాస్టార్ (థమ్స్ డౌన్)

ఓవర్ యాక్షన్ అనడం బాధించింది - శ్రీ రాపకపై అరియానా ఫైర్, అఖిల్ కూడా అదే బాట!

ఖాళీగా ఉండి కబుర్లు చెబుతున్న కంటెస్టెంట్లకు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన, నచ్చని వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపాడు. దీనివల్ల బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రచ్చ జరిగేలా ఉంది. ముందుగా అరియానా తనకు అజయ్‌కు థమ్స్ అప్ ఇచ్చింది. శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని అరియానా ఫీలయ్యింది. ఆ తర్వాత అఖిల్ కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చాడు. 

నామినేషన్లపై నటరాజ్ మాస్టర్ ఆగ్రహం, అంతా నన్నే టార్గెట్ చేశారంటూ..

నిన్న జరిగిన నామినేషన్ల ప్రోమో: నామినేషన్లపై నటరాజ్ మాస్టర్ ఆగ్రహం. 





సినిమా వాళ్లను పెళ్లి చేసుకోనన్న అరియానా, నేను ఫస్ట్ చేసే పని అదే - చైతూ

‘‘పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే..’’ పాటతో బిగ్ బాస్.. కంటెస్టెంట్లను నిద్రలేపాడు. అయితే, పాట కంటే ముందే వారియర్స్ టీమ్‌ సభ్యులతా ఇంటి పనుల్లో నిమగ్నం కావడం గమనార్హం. అరియానా, చైతూలు పెళ్లి, ఇల్లు గురించి కబుర్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ.. నేను సినిమా వాళ్లను పెళ్లి చేసుకోనని చెప్పింది. దీంతో చైతూ మాట్లాడుతూ ‘‘నైనేతై బయటకు వెళ్లాక అదే చేస్తాను. ముందుగా ఇల్లు కట్టేస్తా’’ అని తెలిపాడు. మరోవైపు గార్డెన్ ఏరియాలో శివ రాత్రి పూట చేస్తున్న చిలిపి పనుల గురించి పెద్ద చర్చే జరిగింది. చివరికి స్రవంతి కూడా అతడిని ఆట పట్టించింది. 

ఈ వారం నామినేట్ అయ్యింది వీరే

ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే..:
శివ - సరయు, ముమైత్ ఖాన్‌ను నామినేట్ చేశాడు. 
మిత్ర శర్మ - అరియనా, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. 
ఆర్జే చైతు - హమీద, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు.
అజయ్ - నటరాజ్ మాస్టర్‌, సరయును నామినేట్ చేశాడు. 
శ్రీరాపాక - అరియనా, ముమైత్‌ను నామినేట్ చేసింది. 
అనిల్ రాథోడ్ - నటరాజ్ మాస్టర్, సరయును నామినేట్ చేశాడు.  
బిందు మాధవి - అఖిల్, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. 


ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే: నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, అఖిల్. 

Background

Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్ - నాన్‌స్టాప్’ ఓటీటీ సీజన్-1 శనివారం మొదలైన సంగతి తెలిసిందే. హోస్ట్ అక్కినేని నాగార్జున 17 మంది సభ్యులను హౌస్‌లోకి పంపించారు. వీరిలో పాత, కొత్త కంటెస్టెంట్స్ ఉన్నారు. అంటే.. ‘బిగ్ బాస్’ గత సీజన్లలో ఎలిమినేట్ అయిన సభ్యులను మళ్లీ ఒకే వేదిక మీద చూసే అవకాశాన్ని ‘బిగ్ బాస్’ కల్పించాడు. ఈ నేపథ్యంలో ఆట మరింత రంజుగా ఉండనుంది. గత సీజన్లతో పోల్చితే బిగ్ బాస్ భిన్నంగా, కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ‘బిగ్ బాస్’ హౌస్ ప్రత్యేకతలు, 3వ రోజు హైలెట్స్ తెలుసుకోండి. 


⦿ ఈ బిగ్ బాస్‌లో 17 మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. 
⦿ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లు 100 రోజులు ఉండేవారు. ఓటీటీ వెర్షన్‌ మాత్రం 84 రోజులకే ముగియనుంది. 
⦿ సాధారణ ‘బిగ్ బాస్’ సీజన్లలో అంతా కొత్త సెలబ్రిటీలే ఉంటారు. కానీ, ఈ బిగ్ బాస్‌లో మాత్రం గత సీజన్లో ఎలిమినేటైన సభ్యులు కూడా ఉన్నారు. 
⦿ గత సీజన్‌లో ఉన్న సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులును ఛాలెంజర్స్‌గా విభిజించారు. 
⦿ ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారికి ఒక ‘హ్యాష్‌ట్యాగ్‌’ను ఇచ్చారు. వారు హౌస్‌లో ఎలా ఉండనున్నారో చెప్పేందుకు ఇదొక ట్యాగ్.
⦿ గత సీజన్లో ఉన్న బిగ్ బాస్ హౌస్ కంటే.. ఓటీటీ ‘నాన్ స్టాప్’ సీజన్ హౌస్ చాలా పెద్దదిగా, విశాలంగా ఉంది. 
⦿ ఈ సారి గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్‌తోపాటు బాత్ టబ్ కూడా ఏర్పాటు చేశారు. 
⦿ గత సీజన్లలో కంటే.. భిన్నంగా, కలర్‌ఫుల్‌గా హౌస్ డిజైన్ చేశారు. 
⦿ రెగ్యులర్ ‘బిగ్ బాస్’ సీజన్లలో కంటే ఎక్కువ టాస్క్‌లు ఈ కొత్త సీజన్లో ఉండనున్నాయి. 
⦿ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ 24x7 టెలికాస్ట్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే, శనివారం మాత్రం రికార్డెడ్ ఎపిసోడ్స్‌ను మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలుపెట్టారు. 


బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
 
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్) 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.