Ashu Reddy Kisses Anil | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్ లేకపోవడంతో ‘బిగ్ బాస్’ తన కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చాడు. అవి అలా సాగుతుంటే.. అషు రెడ్డి, అనిల్ మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఇద్దరూ కంబైండ్ స్టడీ చేస్తున్న స్టూడెంట్స్‌లా ఒకే పక్కన కూర్చొని తమ ‘కెమిస్ట్రీ’ ప్రతిభను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
‘బిగ్ బాస్’ తాజా ప్రోమో ప్రకారం.. అషు రెడ్డి, అనిల్ ఒకే సోఫాలో కూర్చొని ఉన్నారు. ఈ సందర్భంగా అషూ రెడ్డి.. అనిల్ కళ్లలోకి చూస్తూ.. ‘నీకు ముద్దు పెట్టాలని ఉంది’’ అని తెలిపింది. దీంతో అనిల్ సిగ్గపడుతూ అషూ కళ్లలోకి చూశాడు. దీంతో ఆమె అనిల్ చేతిని తీసుకుని ముద్దు పెట్టింది. ఆ తర్వాత అనిల్ కూడా ఆమె చేయిని అందుకుని ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఇంకేముంది.. బిగ్ బాస్ కావాల్సిన స్టఫ్ దొరికేసింది. ఇకపై ఈ జంటనే తెగ ఫాలో అయిపోతాడని అర్థమైపోతుంది.
Also Read: ‘బిగ్ బాస్’లోనూ ‘భీమ్లా నాయక్’లు - ‘డేనియల్ శేఖర్’లతో రచ్చ రచ్చ!
వీరి ప్రయాణం ఇలా ప్రశాంతంగా సాగిపోతుంటుంగా.. తేజశ్వీ మాత్రం తుఫాన్‌లో చిక్కున్న బాటసారిలా విలవిల్లాడుతోంది. అనవసరంగా నటరాజ్ మాస్టార్‌ను కదిపి.. మాటలు పడుతోంది. టాస్క్ ప్రకారం.. హౌస్ సభ్యులు మిత్రకు ఇష్టమైన ఒక వస్తువును ‘బిగ్ బాస్’ మెయిల్ బాక్సులో పెట్టేశారు. ఆ తర్వాత అషూ రెడ్డి.. అరియానకు ఇష్టమైన మొక్కను తుంచేసింది. దీంతో అరియానా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నుంచి ఒకరిని తప్పిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో తేజశ్వీ.. ఇంకా అనిల్ రాథోడ్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండని తోటి సభ్యులకు తెలిపింది. ఆమె మాటలు విని నటరాజ్ మాస్టార్ చికాకు పడ్డాడు. దీంతో తేజస్వీ మీకు ఇరిటేషన్ ఎందుకు వస్తుందని ఆయన్ని ప్రశ్నించింది. ఇన్ఫులెన్స్ చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తాదని అని నటరాజ్ అన్నాడు. ఆ మాటకు తేజశ్వీ ఏడుస్తూ.. ‘‘నిన్ను ఇన్ఫులెన్స్ చేసి పంపించేశానంట’’ అని అఖిల్‌కు తెలిపింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టార్.. ‘‘గేమ్ ఆడకుండా వె*వ యాక్టింగ్‌లు చేయకు. ఇది బిగ్ బాస్ హౌస్’’ అని తేజశ్వినితో అన్నాడు. మొత్తానికి ‘బిగ్ బాస్’ హౌస్.. మూడు టాస్కులు, ఆరు గొడవులుగా సాగుతోంది.
Also Read: మాస్టార్ మారలేదు, ‘బిగ్ బాస్’లో చెంపలు వాయించుకుని ఏడ్చేసిన నటరాజ్