‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రం రెండు ఓటీటీల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘డిస్నీ హాట్ స్టార్’‌తోపాటు ‘ఆహా’ ఓటీటీలో కూడా 23వ తేదీ మిడ్‌నైట్ తర్వాత నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. అయితే, అత్యధిక వ్యూస్.. సబ్‌స్క్రైబర్లను సంపాదించడం కోసం రెండు ఓటీటీలు పోటీ పడుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రోమోలను వదులతూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఈ ఫీవర్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’(Bigg Boss Telugu OTT) హౌస్‌ను కూడా తాకింది. 


తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. సభ్యులకు ‘భీమ్లా నాయక్’ యాక్టివిటీ ఇచ్చాడు. ఇంటి సభ్యుల్లో ఎవరు నాయక్? ఎవరు డేనియల్ శేఖరో చెప్పాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సభ్యులకు రెడ్, బ్లాక్ కండువాలు ఇచ్చాడు. ఇంట్లో ‘భీమ్లా నాయక్’కు ఎంపికయ్యే సభ్యుడికి ఎర్ర కండువా, డేయినల్ శేఖర్‌గా ఎంపికైన సభ్యుడికి నల్ల కండువా కప్పాలని చెప్పాడు. ఇది ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలకు దారి తీసింది. 


Also Read: మాస్టార్ మారలేదు, ‘బిగ్ బాస్’లో చెంపలు వాయించుకుని ఏడ్చేసిన నటరాజ్


బింధు మాదవి శివకు ఎర్ర కండువా కప్పి.. నువ్వు ఈ ఇంట్లో ‘నాయక్’ అని చెప్పింది. ఆ తర్వాత మిత్రాకు తేజస్వీ, అఖిల్‌కు నటరాజ్, అజయ్‌కు అరియానా, తేజస్వీకి మహేష్ విట్టా ఎర్ర కండువాలు వేసి ఇంట్లో ‘నాయక్’లు వీరేనని పేర్కొన్నారు. ఆ తర్వాత డేనియల్‌‌ను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా అజయ్‌కు స్రవంతి, అషురెడ్డికి తేజశ్వీ, స్రవంతికి బిందు మాధవి, తేజశ్వీకి అషురెడ్డి, స్రవంతికి అనిల్, శివకి హమీద, మహేష్ విట్టా, అషూరెడ్డికి సరయు, మహేష్ విట్టాకు శివ నల్ల కండువాలు వేసి.. హౌస్‌లో వారంతా డేనియల్ శేఖర్(ఖల్ నాయక్) అని పేర్కొన్నారు. ‘బిగ్ బాస్’ (Bigg Boss Non Stop) నాయక్-డేనియల్‌ను ఈ విధంగా వాడేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు కదూ. 


Bigg Boss Non-Stop Day 25 Promo: