Bigg Boss Fame Syed Sohel News: బిగ్‌బాస్‌ ఫేం సయ్యద్‌ సోహెల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో తనదైన ఆట తీరు, మాస్‌ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాడు. అంతేకాదు 'అట్లుంటది మనతోటి' అంటూ బిగ్‌బాస్‌ ఇంట ఫేమస్‌ అయ్యాడు. ముఖ్యంగా ఆరియాన గ్లోరీతో టామ్‌ అండ్ జెర్రీ కోట్లాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేది. సింగరేణి ముద్దుబిడ్డ అంటూ తనను కొత్త పరిచయం చేసుకున్న సోహెల్‌ హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు క్రష్ణవేణి సీరియల్‌తో బుల్లితెర హీరోగా గుర్తింపు పొందిన సోహెల్‌ ఇంట విషాదం నెలకొంది. తాజాగా ఆయన తల్లి మృతి చెందినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.


గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్ని సమస్యలతో బాధపడుతున్న ఆమెను డయాలసీస్‌ కోసం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ కన్నుమూసినట్టు సమాచారం. ఆమె మత్రదేహాన్ని వారి సొంతూరు కరీంనగర్ తరలించి అక్కడే అంత్యక్రియలు జరిపించనున్నారు. సోహెల్‌ తల్లి మరణించిన వార్త తెలిసి బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌, ఇండస్ట్రీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అతడి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. కాగా సోహెల్‌ సొంతూరు కరీంనగర్‌లోని పెద్దపల్లి జిల్లా. తండ్రి సయ్యద్ సలీంతో పాటు తల్లి, తమ్ముడు ఉన్నారు. 



Also Read: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?


సొహెల్ కెరీర్ విషయానికొస్తే 'కొత్తబంగారు లోకం' సినిమాలో కనీకనిపించని పాత్ర చేశాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో సైడ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలా హీరో కూడా అయిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో సొహెల్ హీరోగా చేశాడు. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేస్తున్నాడా లేదా అనేది తెలియాలి. ఇక సొహెల్ తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్‌కి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌