Bigg Boss Agnipariksha - Episode 15 Review: బిగ్ బాస్ అగ్ని పరీక్ష పూర్తి అయింది. ఇందులో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 13 మందిలోంచి ఓ 5 గురు మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఆ 5 మంది ఎవరు అన్నది చూడాలి. ఇక నిన్నటి గురువారం టాస్క్‌ని శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రారంభించారు. దివ్యతో హరీష్ ఆటను కంటిన్యూ చేశారు. కలర్ బాల్స్ టాస్క్‌లో లక్ కలిసి వచ్చి హరీష్ గెలిచాడు. దీంతో దివ్యకి చెందిన బాక్స్‌లు కూడా హరీష్‌కే దక్కాయి. ఆ తరువాత కళ్యాణ్ పడాలతో టాస్క్ ఆడాడు. కానీ ఆ బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్‌లో హరీష్‌ను కళ్యాణ్ ఇట్టే ఓడించేశాడు. ఆ తరువాత అనూషను సూదిలో దారం పెట్టే టాస్కులో మళ్లీ పవన్ ఓడించాడు. ఇక ఈ టాస్కులకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వర్తి, అన్ వర్తి టాస్కుని కంటిన్యూ చేశారు.

ప్రియా వచ్చి తన గురించి తాను ఎందుకు వర్తి అన్నది చెప్పుకుంది. అన్ని పరిస్థితుల్ని హ్యాండిల్ చేస్తానని, టఫ్ కాంపిటీషన్ ఇస్తానని చెప్పుకుంది. ఇక శ్రేయాని అన్ వర్తి అని చెప్పింది. ఇంట్లో ఉండలేదు.. అంత వయలెన్స్‌ను భరించలేదు అని చెప్పింది. ఆ తరువాత దివ్య వచ్చి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది.. మాట్లాడే సత్తా కూడా ఉంది.. అని తన గురించి తాను చెప్పుకుంది. ఏదో ఒక పర్సనాలిటీని తెచ్చి పెట్టుకున్నారు.. నటిస్తున్నారు.. అని హరీష్‌ని అన్ వర్తి అని చెప్పింది. ఆ తరువాత అనూష వచ్చింది. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను అని తన గురించి తాను వర్తి అని చెప్పుకుంది. పవన్‌కి గేమ్ అర్థం కావడం లేదు.. కనీసం ఎదుటి వాళ్లతో వాదించలేకపోతున్నాడని అన్ వర్తి అని చెప్పింది.

Also Read'కొత్త లోక 1: చంద్ర' రివ్యూ: వంద కోట్ల వసూళ్ళు సాధించిన ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఇండియన్ సినిమా... కల్యాణీ ప్రియదర్శన్ మూవీ ఎలా ఉందంటే?

చివరగా శ్రీజ వచ్చి తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఆడిషన్స్‌కి వచ్చినప్పుడు.. కొంత మందికి నచ్చిన.. చాలా మందికి నచ్చలేదు.. నో అన్న అభిజిత్, బిందు మాధవి వాళ్లతోనే ఎస్ అనిపించుకున్నాను.. నేను బిగ్ బాస్ ఇంటికి వర్తి అని చెప్పుకొచ్చింది. శ్రేయాకి ఇంకా మెచ్యూరిటీ రాలేదేమో అని అన్ వర్తి అని చెప్పేసింది. ఇక హరీష్, షాకిబ్‌లకు మూడు అన్ వర్తి బోర్డులు వచ్చాయి. ఆ తరువాత కల్కితో ఆడేందుకు కళ్యాణ్ పడాల ఛాలెంజ్ విసిరాడు. కలర్ బాల్స్ పజిల్ టాస్కులో పడాలని కల్కి ఓడించేసింది.

ఆ తరువాత డీమాన్ పవన్‌తో కల్కి ఆట ఆడేందుకు సిద్దమైంది. అయితే మధ్యలో సత్య దేవ్ వచ్చాడు. రావు బహదూర్ సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఆ తరువాత క్రాస్ వర్డ్ పజిల్ ఆటలో కల్కిని డిమాన్‌ని పవన్ ఓడించేశాడు. ఆ తరువాత దాల్యతో ఆట ఆడేందుకు పవన్ రెడీ అయ్యాడు. కప్పులో బాల్స్ పడేసే టాస్క్.. దాల్యను ఓడించి పవన్ గెలిచాడు. ఆ తరువాత శ్రీజతో ఆట ఆడేందుకు పవన్ రెడీ అయ్యాడు. బల్బ్ మీద బాల్ నిలబెట్టే టాస్కులో శ్రీజ గెలిచింది. ఇక చివరకు మనీష్, శ్రీజ మధ్యలో అయస్కాంతం ఆటను పెట్టారు. అందులో శ్రీజ ఓడింది. ఇక చివరకు ఒక్క ఆట ఆడి.. మొత్తం గెలిచేశాడు మనీష్. చివరకు ఓట్ అప్పీల్ చేసుకున్నాడు.

బిందు, నవదీప్, అభిజిత్ ఇలా అందరూ కంటెస్టెంట్లకు మెసెజ్‌లు ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోని పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందో.. ఎవ్వరికీ తెలీదు.. మీ అందరినీ చూసిన తరువాత మేం మంచి నిర్ణయమే తీసుకున్నామనే ఫీలింగ్ కలుగుతోంది. ఇక్కడి నుంచి మీ గ్రాఫ్ పెరగాలి.. అని అభిజిత్ సందేశమిచ్చాడు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ కూడా కామనర్స్.. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడి వరకు వచ్చారు.. ఈ రోజు ఇలా మేం ఈ స్థాయికి వచ్చామని, మేం చేయగలిగినప్పుడు మీరు కూడా చేస్తారంటూ శ్రీముఖి చెప్పింది. ఇక సెప్టెంబర్ 7న రాత్రి 7 గంటలకు అసలు సిసలు బిగ్ బాస్ ఆట ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంట్లోకి అడుగు పెట్టే సెలెబ్రిటీలు ఎవరు? ఆ కంటెస్టెంట్ల లిస్ట్ మరి కాసేపట్లో పూర్తిగా బయటకు రానుంది.