Bigg Boss Agnipariksha- The Final Phase Begins: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ముగిసే టైం వచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి అసలు బిగ్ బాస్ ఆట ఆరంభం కానుంది. ఈ రోజు, రేపు మాత్రం అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ రానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరిని ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్ని పరీక్షలో 13 మంది కంటెస్టెంట్లున్నారు. ఇందులో ఒక్కో జడ్జ్ తమకు నచ్చిన కంటెస్టెంట్‌ని డైరెక్ట్‌గా ఇంట్లోకి పంపించే అవకాశాలున్నాయి. మిగిలిన ఇద్దరినీ ఓటింగ్ ద్వారా పంపించేలా ఉన్నారు. అలా ఈ 13 మంది నుంచి 5 గురు మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తారని అర్థం అవుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం..
బిగ్ బాస్ ఇంట్లో ఉండే సత్తా ఎవరికి ఉంది.. అర్హత ఎవరికి లేదు.. వర్తీ ఎవరు.. అన్ వర్తీ ఎవరు? అన్న చర్చను తీసుకు వచ్చారు. ఈ క్రమంలో హరీష్ వచ్చి తనకు మాట్లాడే సత్తా ఉందని, ప్రశ్నిస్తాను.. తాను అర్హుడ్ని అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇక షాకిబ్ అన్ వర్తి అని.. ఫైర్ కనిపించడం లేదని అన్నాడు. టైం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను.. అని షాకిబ్ అన్నాడు. ఇక షాకిబ్ మళ్లీ హరీష్‌ను అన్ వర్తి అన్నాడు. ముక్కు సూటిగా మాట్లాడటం తప్ప ఇంకేం చేయడం లేదు అని కారణం చెప్పాడు.
ఆ తరువాత మనీష్ వచ్చి తన గురించి తాను చెప్పుకున్నాడు. తప్పులు తెలుసుకుని వాటిని అధిగమిస్తున్నాను.. ప్రారంభంలో ఓటమి పాలైనా ఇప్పుడు గెలుస్తున్నా అని అన్నాడు. మనీష్ విషయంలో నాగ అన్ వర్తి. ఇంత వరకు ఒపీనియన్ చెప్పలేదు.. టాస్కులు ఓకే.. కానీ తన అభిప్రాయాల్ని చెప్పడం లేదు.. సేఫ్ గేమ్ లా ఉంది అని నాగ గురించి మనీష్ చెప్పుకొచ్చాడు. నేను ఫ్లిప్ అవ్వలేను.. నిజాయితీగా ఉంటాను.. నాకు కష్టాలు మామూలే.. నేను ఇలానే ఉంటా.. నేనింతే.. నా తప్పుల్ని నేను తెలుసుకుంటున్నా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నా.. అని నాగ అన్నాడు.
Also Read: ఇప్పుడు బెల్లంకొండపై... సంక్రాంతికి చిరంజీవిపై... 'మిరాయ్', 'రాజా సాబ్' నిర్మాతపై సాహు గరమ్ గరమ్?
నాగకి షాకిబ్ అన్ వర్తి అనిపించాడట. రేసులో వెనకపడిపోయాడు.. ఎల్లో కార్డు ఉన్న మనీష్.. శ్రేయా కూడా గెలిచేస్తోంది.. అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారు.. కానీ షాకిబ్ మాత్రం వెనకపడిపోతోన్నాడు.. అని కారణాలు చెప్పాడు. ఆ తరువాత కల్కి వచ్చి.. ప్రారంభంలో కాస్త డల్‌గా అనిపించింది.. కానీ ఇప్పుడు అందరికీ పోటీ ఇస్తున్నా.. అని తన గురించి తాను చెప్పుకుంది. డిమాన్ పవన్ అన్ వర్తీ అని కల్కి చెప్పింది.. వినే ఓపిక కూడా ఉండదు.. అర్థం చేసుకోడు.. గేమ్ సరిగ్గా ఆడడు.. అని కారణాలు చెప్పింది.
పవన్ పడాల వచ్చి తన గురించి తాను చెప్పుకున్నాడు. నేను నా గురించి ఆలోచిస్తా.. పక్క వారిని కూడా చూసుకుంటా.. అందరితో కలిసిపోతా అని అన్నాడు.. షాకిబ్ అన్ వర్తి అని చెబుతూ.. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి.. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి.. కానీ ఇవేవీ అతనిలో లేవు అని అన్నాడు. టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అని షాకిబ్ అంటే.. అప్పటి వరకు షో ఉండదు.. కదా అని పవన్ సెటైర్ వేశాడు. ఇక ఈ వాగ్వాదాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఆటను పెట్టారు.
అందరూ డిస్కో లైట్ సెట్ మీద నిలబడాలని చెప్పడంతో.. అందరూ వచ్చి ఒక్కో కలర్ ఉన్న బాక్స్ మీద నిల్చున్నారు. ఇక అందులో ఉన్న ఓ కంటెస్టెంట్ చుట్టూ ఉన్న మిగిలిన కంటెస్టెంట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. అలా పోటీ పడిన తరువాత ఎవరో ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడిపోతారు.. అలా ఓడిపోయిన వారి బాక్స్ గెలిచిన వారికి సొంతం అవుతంది. అలా గ్రీన్‌లోకి బాక్సులు మారుతుంటాయి. అలా చివరి వరకు ఎవరు నిలబడతారు.. ఎవరు గ్రీన్ అయ్యే వరకు గెలుస్తుంటారో.. వారి చివరకు విన్నర్ అని చెప్పారు.
అలా ఫస్ట్ ఈ ఆటను దివ్య స్టార్ట్ చేసింది. ప్రియతో దివ్య మొదటి టాస్క్ ఆడింది. రివర్స్ పిరమిడ్ పెట్టే ఈ టాస్కులో ప్రియా చిత్తుగా ఓడింది. దీంతో దివ్య రెండు బాక్సుల్ని సొంతం చేసుకున్నట్టు అయింది. ఆ తరువాత మళ్లీ దివ్య ఆడేందుకు శ్రేయాను ఎంచుకుంది. బిగ్ బాస్ లోగో పజిల్ టాస్కులో శ్రేయా ఓడింది. దీంతో దివ్యకు మొత్తంగా మూడు గ్రీన్ బాక్సులు వచ్చేశాయి. అలా దివ్య కాస్త ఆటకు రెస్ట్ ఇచ్చి.. మిగతా వాళ్లకు ఆట ఆడే ఛాన్స్ ఇచ్చింది. అలా షాకిబ్ వచ్చి హరీష్‌తో ఆడేందుకు ఛాలెంజ్ విసిరాడు.
కానీ ఆ బాల్స్ వేసే టాస్కులో షాకిబ్ చిత్తుగా ఓడాడు. హరీష్ విన్ అవ్వడంతో రెండు బాక్సుల్ని స్వాధీనం చేసుకున్నట్టు అయింది. ఆ తరువాత హరీష్ మళ్లీ నాగతో ఆట ఆడాడు. ఎక్వేరియంలో బౌల్ పెట్టడం, బౌల్‌లో రంగు నీళ్లు పోసే ఈ టాస్కులో చివరకు హరీష్ విన్ అయ్యాడు. అలా దివ్యకి మూడు, హరీష్‌కి మూడు బాక్సులు వచ్చేశాయి. ఈ ఆట తరువాత మళ్లీ వర్తి, అన్ వర్తి వాగ్వాదం స్టార్ట్ చేశారు. దాల్య వచ్చి.. నేను వంద శాతం ఎఫర్ట్ ఇస్తాను అని చెప్పుకుంది.. రియాల్టీ అంటారు..కానీ ఉండరు.. పర్సనల్‌గా అటాక్ చేస్తారు.. బ్యాక్ బిచింగ్ చేస్తారు.. అని హరీష్‌ను అన్ వర్తి అని చెప్పింది.
Also Read:బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11 రివ్యూ... మనీష్‌కు ఘోర పరాభవం - ఎగిరి గంతులేసిన శ్రేయా
పవన్ పడాల వచ్చి.. తప్పులు తెలుసుకుని ఒప్పుకుని ముందుకు వెళ్తాను అందుకే నేను బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు వర్తి అని చెప్పుకున్నాడు.. కల్కి అన్ వర్తి అని చెబుతూ.. పాయింట్ టు పాయింట్ మాట్లాడదు.. ఇంత వరకు ఆమె మీద ఎలాంటి ఒపీనియన్ ఏర్పడలేదు.. అని కారణాలు చెప్పాడు. శ్రేయా వచ్చి.. ఎంటర్టైన్ చేస్తాను అందుకే బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు వర్తీ అని చెప్పింది.. కల్కి బయట హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం అలా ఉండటం లేదు.. ఆమె అన్ వర్తి అని చెప్పుకొచ్చింది.
ఆ తరువాత మళ్లీ ఆటలోకి వచ్చారు. హరీష్ ఏకంగా దివ్యని ఓడించి మొత్తంగా ఆరు బాక్సుల్ని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆటను మాత్రం నేటి ఎపిసోడ్‌లో ప్రారంభించలేదు. రేపటి ఎపిసోడ్‌లో ఆట ఉంటుందని శ్రీముఖి చెప్పింది. ఇక రేపటితో ఈ అగ్ని పరీక్ష సమాప్తం కానున్న సంగతి తెలిసిందే. రేపు ఎంత మందిని ఆట నుంచి ఎలిమినేట్ చేస్తారో చూడాలి.
Also Read: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 రివ్యూ... శ్వేత, ప్రసన్న ఎలిమినేషన్... ఎగిరి గంతులేసిన మనీష్