Bigg Boss 9 Telugu - First Week Elimination: బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇక 9వ సీజన్‌లో ఫస్ట్ వీక్ గడిచేందుకు వస్తోంది. ఈ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ అనంతరం టెనెంట్స్‌లో భరణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇక ఓనర్స్ నుంచి పవన్ నామినేట్ అయ్యాడు. ఇక నామినేషన్ ప్రక్రియ అయిన తరువాత అందరికీ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరు అన్నది కాస్త క్లారిటీ వచ్చింది. శ్రష్టి వర్మ లేదా ఫ్లోరా షైనీలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు.
ఇప్పుడు అనుకున్నదే జరిగింది. శ్రష్టి వర్మకు తక్కువ ఓట్లు రావడంతో ఆమెను బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోంచి మొదటి వారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఈ మేరకు లీక్స్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. శ్రష్టి వర్మ ఈ మొదటి వారంలో ఏ టాపిక్‌లోనూ హైలెట్ అవ్వలేదు. ఏ ఒక్క ఎపిసోడ్‌లోనూ శ్రష్టి వర్మకు పేరు రాలేదు. అసలు ఆమె ఉందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
ఇక ఆమె మీద సోషల్ మీడియాలో ఉండే నెగెటివిటీ అందరికీ తెలిసిందే. ఆమె పోస్ట్ పెడితే.. అందులో దాదాపు 70 శాతం కామెంట్లు నెగెటివ్‌గానే వస్తాయి. జానీ మాస్టర్ విషయంలో శ్రష్టికి సోషల్ మీడియాలో నెగెటివిటీ ఏర్పడింది. ఆ నెగెటివిటీయే ఇప్పుడు కొంప ముంచినట్టుగా కనిపిస్తోంది. శ్రష్టిని జనాలు యాక్సెప్ట్ చేయలేదని అర్థం అవుతోంది. దానికి తోడు శ్రష్టి సైతం ఈ మొదటి వారంలో ఒక్క చోట కూడా తన మార్క్ వేయలేకపోయింది. దీంతో జనాలు ఆమెకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
ఇక శ్రష్టి ఎలిమినేట్ అయినట్టుగా ఇప్పటికే లీక్స్ వచ్చాయి. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తరువాత నెగెటివిటీ రావడం కామన్ గానీ.. విపరీతమైన నెగెటివిటీతోనే బిగ్ బాస్ ఇంట్లోకి రావడంతో శ్రష్టికి మొదటి వారంలోనే బయటకు వెళ్లక తప్పలేదని తెలుస్తోంది. మరి బయటకు వచ్చిన తరువాత శ్రష్టి ఎలాంటి కామెంట్లు చేస్తుందో.. స్టేజ్ మీద అసలు శ్రష్టి ఏ కంటెస్టెంట్ గురించి ఏం చెబుతుందో చూడాలి. ఈ వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా సాగుతాయన్నది కూడా ఇంట్రెస్టింగ్‌గానే మారింది.
Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ... డ్రింక్ చుట్టూ తిరిగిన కథ, నవ్వు రాని టాస్క్... బోరింగ్ ఎపిసోడ్