డే 96 ఉదయాన్నే "గేమ్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్ తో మాట్లాడతా" అంటూనే "మమ్మీ అని పిలవట్లేదు" అని ఎమోషనల్ అయ్యింది సంజన. "నేను భరణి గారితో ఇమ్మూ నాకోసం నిలబడ్డాడు అని ఇక్కడే అన్నాను. అంత మాట అని ఇప్పుడు పాయింట్స్ అడగలేను" అని కళ్యాణ్ తో చెప్పింది తనూజా. సంజన ఓటింగ్ లో నన్ను తీయొద్దు అని ఇమ్మూను అడిగింది. "కానీ నాకు ఈ వీక్ అంతా తనూజా సపోర్ట్ చేసింది. తీయను అని మాటిచ్చాను" అని సమాధానం ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. "ఆ ముగ్గురిలో నేను తనూజకే పాయింట్స్ ఇస్తాను. ఆమె నా గురించి నిలబడకపోయినా నేను నిలబడతాను. సంజనాకు ఆల్రెడీ పాయింట్స్ వచ్చాయి" అని సుమన్ తో చెప్పాడు భరణి. అన్నట్టుగానే తక్కువ స్కోర్ ఉన్న కారణంగా భరణి పోరు నుంచి తప్పుకుని, తన పాయింట్స్ లో సగం తనూజకు ఇచ్చాడు.
సంజన వర్సెస్ ఇమ్మాన్యుయేల్
"నేను చూపిస్తున్నంత ఎఫెక్షన్ అక్కడి నుంచి రావట్లేదు. నాన్నా అని నోరారా పిలిచిన అమ్మాయిని దూరం పెట్టేంత క్యారెక్టర్ లెస్ కాదు నేను. కానీ నాకోసం ఇమ్మూ నిలబడ్డాడు అన్నది బాధ పెట్టింది" అని కళ్యాణ్ తో చెప్పాడు భరణి. ఇక్కడితో తనూజకు 450, ఇమ్మూకి 320, సంజనాకు 320 పాయింట్స్ వచ్చాయి. ఇదంతా అయ్యాక 'కీ టూ సక్సెస్' అనే టాస్క్ ఆడారు సంజన, ఇమ్మాన్యుయేల్, సంజన. తర్వాత మొదలైంది రచ్చ. టాస్క్ లో ఓడిపోవడంతో సంజన ఎమోషనల్ అయ్యింది. "నన్ను వేరేవాళ్ళు అన్నావు" అంటూ ఇమ్మూతో గొడవేసుకుంది. "నావన్నీ తీసేసి దూరం పారేశావు" అని తనూజా ఏడ్చింది. ఇమ్మూ "నేను మనిషిని కాదా? మీరు ఆడితే గేమ్, నేను ఆడితే బంధాలా" అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఈ టాస్క్ కు భరణి సంచాలకులు. ఇందులో ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. నిజానికి సంజన - ఇమ్మూ ఇద్దరూ సేమ్ స్కోర్ చేశారు. "ఇది టై. ముందు పెట్టారా తరువాత పెట్టారా అనేది కాదు. నేను కూడా సంచాలక్ గా 100 గేమ్స్ చేశాను. రాంగ్ డెసిషన్ ఎప్పుడూ తీసుకోలేదు" అని చెప్పింది సంజన. కానీ భరణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఇమ్మూ 470, తనూజా 350, సంజన 320 పాయింట్స్ కు చేరుకున్నారు. తర్వాత పోరు నుంచి సంజనాను తీసేశారు.
తనూజకు ఊహించని బిగ్ షాక్
తర్వాత లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి 'బ్యాలెన్స్ చెయ్ డ్యూడ్' అనే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ ఆడుతుండగా, ఇమ్మూ కాలు బెణికి, నొప్పితో విలవిల్లాడిపోయాడు. మెడికల్ రూమ్ కి తీసుకెళ్లగా, కాసేపటికి సెట్ అయ్యాడు. ఇక టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. "చివరి వరకూ వచ్చి గెలుస్తాను అనే టైమ్ లో ఓడిపోవడం నా జీవితం" అని ఎమోషనల్ అయ్యింది తనూజా. ఈ టాస్క్ అనంతరం ఇమ్మూ 520, తనూజా 450, సంజన 320 పాయింట్స్ తో ఉన్నారు. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి చివరి టాస్క్ 'రైజ్ ద బార్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజా విన్ అయ్యి టాప్ లోకి వచ్చింది. చివరి దాకా వచ్చి ఇలా ఓడిపోయినందుకు ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందులో తనూజా 750, ఇమ్మూ 520, సంజన 320 పాయింట్స్ తెచ్చుకున్నారు.
తనూజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హయ్యెస్ట్ స్కోర్ సాధించేందుకు అభినందించారు బిగ్ బాస్. "మీకు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యి, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఛాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. టాపర్ కాబట్టి మీ దగ్గర ఉన్న 3 లక్షలతో ఇమ్యూనిటీని కొనుక్కుని, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే చాన్స్ ఉంది. కానీ అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది. మీరు ఈ ఆప్షన్ ను చూజ్ చేసుకుంటారా? ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే నామినేషన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని చెప్పారు. దీంతో జనాల నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పింది తనూజా.