డే 84 ఎపిసోడ్లో ఫన్ డే అంటూ నాగార్జున వచ్చేశారు. 'గార్డెన్ ఏరియాలో మనకోసం హౌస్ మేట్స్ వెయిట్ చేస్తున్నారు' అంటూ ఒక్కొక్కరి డ్రెస్ పై ప్రశంసలు కురిపించారు. 'ఎప్పుడూ దివ్యానే ఎందుకు ఉండాలి? తనూజా కూడా సంచాలక్ గా ఉండాలి' అని ఆమెను సంచాలక్ గా చేశాడు. త్రాసులో వెయిట్ తో ముందుగా డెమోన్ పవన్ సేవ్ అయ్యాడు. అనంతరం భరణి టీం, సంజన టీం అంటూ రెండు టీంలుగా హౌస్ మేట్స్ ను విడగొట్టారు. 5 సెకండ్ల వీడియోను చూసి మూవీ నేమ్ ను గెస్ చేయాలన్నది టాస్క్. ఈ క్రమంలోనే తనుజా ఆడిన ఒక అబద్ధం గురించి చెప్పమన్నారు. కానీ ఆమె బదులు సంజన మాట్లాడుతూ 'తనుజా ఎప్పుడూ నాతో గొడవ పడుతుంది. అందుకే ఆమె ఎక్పెన్సివ్ బాడీ వాష్ తో బట్టలు ఉతుక్కున్నా' అని చెప్పి షాక్ ఇచ్చింది. ఈ టాస్క్ లో భాగంగా 'మన్మథుడు' మూవీ రావడంతో 'నా ఫేవరెట్ సాంగ్' అంటూ 'నేను నేనుగా లేనే' సాంగ్ పాడింది తనుజా. నెక్స్ట్ 'ఇస్టాలో బ్రాండ్ డీల్స్ చేస్తా కదా. అందులో సగమే మా పేరెంట్స్ కు చెబుతా. మిగతావి నొక్కేస్తా' అంటూ దివ్య సీక్రెట్ చెప్పింది. తరువాత బెస్ట్ మూమెంట్ అంటూ భరణి, ఇమ్మూ, రీతూ కలిసి డ్యాన్స్ చేసిన క్లిప్ ను చూపించారు. సంజన టీం ఇందులో విన్ అయ్యింది.

Continues below advertisement


సంజనాకు ఫ్యామిలీ ట్రీలో దక్కని స్థానం 
'బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ ట్రీలో నుంచి ఈ హౌస్ లో ఎవరు ఉండడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ బొమ్మను తీసి, డస్ట్ బిన్ లో పడేసి చెప్పాలి' అని మరో టాస్క్ పెట్టారు. భరణి 'మొదటి వీక్ నుంచి మీ గేమ్, హౌస్ హార్మనీని దృష్టిలో పెట్టుకుని' సంజన పేరు చెప్పారు. సంజన వచ్చి 'తను నన్ను బూతులు తిట్టింది. సారీ కూడా చెప్పలేదు. లాస్ట్ 3 వీక్స్ నుంచి ప్రతివారం నాతో గొడవ పడి నన్ను రెచ్చగొట్టింది. నేను ఫ్యామిలీ అనుకుంటున్నా. కానీ ఆమె డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది' అని రీతూ పేరు చెప్పింది. రీతూ 'దివ్య కంటే మిగిలిన వాళ్ళతోనే ఎక్కువ బాండ్ ఉంది' అని చెప్పింది. సేమ్ అదే రీజన్ తో దివ్య రీతూకి ఇచ్చింది. డెమోన్ 'ఎక్కువ మందితో ఈ హౌస్ లో ప్రాబ్లం ఉన్నది' అని సంజనాకు ఇచ్చాడు. సపోర్ట్ లేదని సుమన్, నోరు జారుతుంది అని తనుజా, కళ్యాణ్ కూడా సంజనాకు ఇచ్చారు. "మా మమ్మీ కొన్ని కొన్ని సార్లు మన మంచికోరే వాళ్ళ మాట వింటే బయటకు వెళ్ళే ఛాన్స్ రాదు" అంటూ ఇమ్మూ కూడా సంజనాకు ఇచ్చాడు. సంజనాకు 6 ఓట్లు పడడంతో గేమ్ మార్చుకోవాల్సిన టైమ్ అని హెచ్చరించారు నాగ్. ఇక ఇమ్మూ ఫిమేల్ వాయిస్ తో 'సింహరాశి' సాంగ్ పాడి మెప్పించాడు. మౌత్ ఆర్గాన్ తో ఇమ్మూని సేవ్ చేశారు. 


డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ 
చీటీలు తీసి, దానిపై ఉన్నదాన్ని బొమ్మగా ఒకరు గీస్తే, మరొకరు గెస్ చేయాలి. ఇమ్మూకి 'దేశముదురు' వచ్చింది. దివ్య కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయగా, ఇమ్మూ పోస్టర్ ను 'దేశముదురు' స్టైల్ లో వేశారు. ఇదే విధంగా తనూజాకు 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'రేసుగుర్రం' కళ్యాణ్ కు, రీతూ డెమోన్ కు 'గీత గోవిందం', 'హాయ్ నాన్న' భరణికి, 'చంద్రముఖి' సంజన, 'బాబు బంగారం' సుమన్ కు, 'భాగమతి' దివ్యకు ఇచ్చారు. చివరకు సుమన్, దివ్య మిగలగా... దివ్య ఎలిమినేట్ అయ్యింది. వెళ్తూ బాండింగ్ వల్ల గేమ్ దెబ్బతిందని తనే రివ్యూ ఇచ్చుకుంది. పవన్ నీకోసం నువ్వు ఆడు ఇంకొకరికి ఇవ్వకు, నాకంటే బెటర్ ప్లేయర్ ఇమ్మూ, మాట జాగ్రత్త సంజన, నెగెటివ్ ఏం లేవు నీ గురించి తనూజా, కళ్యాణ్ నువ్వు మోతిచోర్ హీరో అయిపోవాలని కోరుకుంటున్నా, రీతూ బబ్లీ గర్ల్ క్లోజ్ అయిన వాళ్ళ కోసం రాకు, భరణి గెలవాలనే కోరుకుంటా, సుమన్ చోటా ప్యాకెట్ బడా ధమాకా అని అందరి ఆటపై రివ్యూ ఇచ్చింది. 'బిగ్ బాస్ ఒక యోధురాలిని మిస్ అవుతుంది' అని భరణి ఎమోషనల్ అయ్యాడు.