డే 83 రోజు 'సర్ఫ్ ఎక్సెల్ మాటిక్ ఎక్స్ప్రెస్ రేస్ అగైనెస్ట్ టైం అండ్ స్టెయిన్స్' అనే టాస్క్ జరిగింది. దీనికి సంచాలక్ గా దివ్య వ్యవహరించగా, భరణి టీం విన్ అయ్యింది. ముందు సరదాగా సాగిన ఈ టాస్క్ లో దివ్య తన టీంకే సపోర్ట్ చేసింది తనూజా గొడవ చేసింది. ఈ క్రమంలో సీజన్ 9 మొత్తం ఆమెనే సంచాలక్ చేయండి బిగ్ బాస్ అంటూ నోరు జారింది తనూజా. అలాగే భరణి -తనూజా మధ్య మాటల యుద్ధం నడిచింది.
సంజన వితండవాదం
"ఇన్ని గొడవలు ఉంటే మనం లోపలికి వెళ్ళాలి కదా... ఆలస్యం లేకుండా మన టీవీ" అంటూ హౌస్ మేట్స్ ను పలకరించారు నాగార్జున. కెప్టెన్ కళ్యాణ్ ను విష్ చేస్తూ, సైనికుడి రేంజ్ లో సెల్యూట్ చేశారు. "హౌస్ లో ఎక్కువసార్లు కెప్టెన్ అయ్యింది నువ్వే" అని ఇమ్మాన్యుయేల్ ను అభినందించారు. "సంజన రీతూని అలా అనడంతో హౌస్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది" అని చెప్పాడు ఇమ్మూ. హౌస్ మొత్తం సంజనాదే తప్పు అని చెప్పారు. "మధ్యలోకి రాకు అని నీకు ముందే చెప్పింది కదా. స్టాండ్ తీసుకోవాలి కదా?" అని డెమోన్ ను అడిగారు నాగ్.
"ఇక్కడ 100 కెమెరాలు ఉన్నాయి. పర్సనల్ ఏముంది? నాకేం అన్పించిందో అది చెప్పడంలో తప్పేంటి? ఒకవేళ నేను రాంగ్ అయినా నేను నా మాట మీదే నిలబడుతున్నా. 4 వారాలుగా నన్ను గిల్లుతోంది" అంటూ సంజన మొదలుపెట్టింది. "నీ ఆట గురించి నువ్వు చెప్పుకోకుండా అఫెండ్ అయ్యావు. జస్ట్ కలిసి కూర్చుంటేనే అన్ కంఫర్ట్ అయ్యావా? అక్కడే ఎందుకు చెప్పలేదు. మరి నువ్వు ఇమ్మూ క్లోజ్ గా ఉంటే మేము కళ్ళు మూసుకుంటున్నామా? నువ్వు క్లియర్ గా రీతూ - డెమోన్ పై క్యారెక్టర్ అసాసినేషన్ చేశావు. నింద మోపడం చాలా ఈజీ. దాన్ని రూపుమాపడం కష్టం. నువ్వు బయట ఏదో.తప్పు చేశావ్, నీతో కంఫర్ట్ గా లేదు అని ఎవరైనా అంటే... చేయని తప్పుకు ఎంత బాధ పడ్డావో తెలుసు నీకు. అమ్మాయిలకు ఒకలాగా, ఆంటీలకు ఒకలాగా అన్నప్పుడే నిన్ను వార్న్ చేశాను. ఇప్పటికీ నువ్వు అన్ కంఫర్ట్ గా ఉంటే బయటకు వెళ్ళు" అంటూ గెట్స్ ఓపెన్ చేయించారు నాగార్జున.
"19 ఏళ్లు నువ్వు ఒకదానివే కష్టపడ్డావా? చిన్న చిన్న షోలు చేసుకునే వాళ్లకు ఇక్కడ ఉండే అవకాశం లేదా? ఈ హౌస్ లో నువ్వు ఉండాలా వద్దా అనేది నువ్వు నిర్ణయించలేవు" అంటూ ఆమె కోసం గతంలో త్యాగం చేసిన భరణి, ఇమ్మూ, రీతూ, తనూజల చేతిలో నిర్ణయం పెట్టారు. "నేను వెళ్తాను. 10 వారాల దాకా త్యాగం చేయడం వల్లే ఇక్కడ ఉన్నాను అని విన్నాను. నావల్ల కాదు, వెళ్ళిపోతా" అని రిక్వెస్ట్ చేసింది సంజన. "5 నిమిషాలకు ఒక్కసారి నీ మైండ్ మారితే ఇక్కడ నడవదు" అని వార్నింగ్ ఇచ్చారు చివరికి అందరూ కలిసి ఆమె సారీ చెప్తే హౌస్ లో ఉండొచ్చని అన్నారు. అప్పటికీ సంజన ఒప్పుకోలేదు. దీంతో "నీ మీద పడ్డ నింద కంటే పెద్ద బ్లాక్ మార్క్ తో వెళ్తావు ఆలోచించుకో" అన్నారు నాగ్. ఇమ్మూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. చివరికి రీతూతో పాటు ఆడియన్స్ కు సారీ చెప్పింది సంజన.
ఆల్మోస్ట్ అందరికీ క్లాస్
డెమోన్ అగ్రెషన్ లో కాదు ఆపడానికి పీక పట్టుకోలేదు అని క్లారిటీ ఇస్తూ, అగ్రెషన్ లో వాడకూడని బీప్ పదాల గురించి మాట్లాడదాము అన్నారు నాగ్. కోపంలో అలా చేశానని సారీ చెప్పడంతో కళ్యాణ్ వంతు అయిపొయింది. "పవన్ - ఇమ్మూ నామినేషన్ లో నీకేంటి సంబంధం రీతూ? డెమోన్ కి నోరు లేదా? నువ్వు అతనికి లాయర్ వా? కెప్టెన్ గా నామినేషన్ ఎలాంటి గొడవలు లేకుండా జరిగేలా చూసుకోవడం నీ బాధ్యత. నువ్వే బ్రేక్ చేస్తే?" అని రీతూపై ఫైర్ అయ్యాడు నాగ్. ఇందులో తప్పు డెమోన్ దే అని క్లారిటీ ఇచ్చారు. "భరణి - దివ్య - తనూజా మీవల్ల మాకు చిరాకు వస్తోంది. ఆపండి" అని చెప్పారు.
కళ్యాణ్ తనకు ఇమ్మూ స్ట్రాంగ్, ఎనిమి డెమోన్... స్ట్రాంగ్ డెమోన్, బ్యాక్ స్టాబ్ సంజనాకు ఇచ్చారు భరణి. డెమోన్ ఎనిమి, బ్యాక్ స్టాబర్ సంజన అని సుమన్, డెమోన్ ఇమ్మూ స్ట్రాంగ్, కళ్యాణ్ బ్యాక్ స్టాబర్ అని... కళ్యాణ్ డెమోన్ లు టఫ్ అని ఇమ్మూ... దివ్య రీతూ ఎనిమి, తనూజా బ్యాక్ స్టాబర్ అని... సంజన ఇమ్మూ ఎనిమి, రీతూ బ్యాక్ స్టాబర్ అని సంజన... తనూజా ఎనిమి డెమోన్, బ్యాక్ స్టాబ్ ఇమ్ము... కళ్యాణ్ ఎనిమి, ఇమ్మూ బ్యాక్ స్టాబర్ అని రీతూ ఇచ్చారు. ఈ విషయమై ఇమ్మూ, రీతూ మధ్య గొడవైంది.