Bigg Boss 9 Agnipariksha 4th Episode Updates : బిగ్ బాస్ ఇంట్లోకి సామాన్యుల్ని పంపించేందుకు ప్రాసెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్ని పరీక్ష అంటూ ఓ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో 45 మందిలోంచి టాప్ 15ని సెలెక్ట్ చేసేందుకు రకరకాల టాస్కులు నిర్వహిస్తున్నారు. శ్రీముఖి హోస్ట్‌గా అభిజిత్, నవదీప్, బిందు మాధవి న్యాయ నిర్ణేతలుగా ఈ ఎపిసోడ్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలో టాప్ 15లోకి మెగా ఆడిషన్స్ ద్వారా శ్రియా, శ్వేత, ప్రసన్న, అనూష, పవన్, దివ్యా నిఖిత ఇలా ఆల్రెడీ వెళ్లారు.
ఇక మిగిలిన 9 మంది కోసం డేర్ ఆర్ డై అని ఛాలెంజ్‌లు ఇచ్చారు. ఇందులో భాగంగా కొంత మందికి టాస్కులు ఇచ్చి గెలిచిన వారిని టాప్ 15లోకి పంపి.. గోల్డెన్ చెయిర్‌లోకి తీసుకెళ్లారు. అలా ఈ నాలుగో ఎపిసోడ్‌లో దాదాపు ఐదు టాస్కులు పెట్టారు. ఐదు మంది గెలిచి గోల్డెన్ చెయిర్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆ టాస్కుల్ని శ్రీముఖి, నవదీప్, అభిజిత్, బిందు మాధవిలే ఇచ్చారు. ఇందులోనూ ఎక్కడ కొత్త టాస్కులేమీ కనిపించలేదు.
ఫుడ్ తినడం, బెలూన్స్ కట్టి.. కాపాడుకోవడం.. పగలగొట్టడం.. హాఫ్ షేవ్, బిగ్ బాస్ టాటూ అని ఇలా రొటీన్ టాస్కుల్నే ఇచ్చారు. హరీష్ హాఫ్ గుండు కొట్టుకుని గోల్డెన్ చెయిర్‌ను దక్కించుకున్నాడు. శ్రీజ బిగ్ బాస్ టాటూ వేసుకుని టాప్ 15లోకి వెళ్లింది. పవన్ అయితే ఫుడ్ టాస్కులో గెలిచాడు. ప్రియ బెలూన్ టాస్కులో దాల్య మీద గెలిచింది.
ఇక కల్కి, షాకిబ్ మధ్య కాస్త డిఫరెంట్, ఆసక్తికరమైన టాస్కుని శ్రీముఖి ఇచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి ఈ టాస్కుని వివరించింది. అర్జెంట్‌గా ఎవరో ఒకరికి ఫోన్ చేసి వీలైనంత ఎక్కువ అమౌంట్‌ను అకౌంట్లో వేయించుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో కల్కి తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి 90 వేలు అడిగింది. కానీ షాకిబ్‌కు టాస్క్ సరిగ్గా అర్థం కాక ముందు పది వేలు మాత్రమే అడిగాడు.. ఆ తరువాత ఛాన్స్ ఇచ్చినా కూడా వాడుకోలేకపోయాడు. మళ్లీ ఫోన్ చేసినా కూడా అతడికి టోటల్‌గా 60 వేల వరకే వచ్చింది. కానీ కల్కి మాత్రం 90 వేలు అకౌంట్లో వేయించుకుని టాస్కుని గెలిచింది.
ఇక ఈ టాస్కు అన్ ఫెయిర్ అని షాకిబ్ అన్నాడు. ఇద్దరికీ ఒకే రూల్స్ పెట్టాం.. ఇదేమైనా అన్ ఫెయిర్‌లా ఉందా? అని అక్కడి కంటెస్టెంట్లను అడిగితే.. శ్రీజ మాత్రం హ్యాండ్ రైజ్ చేసింది. ఇక ఇలా శ్రీజ హ్యాండ్ రైజ్ చేయడంతో నవదీప్‌కు కాలిపోయింది. ఎందుకు హ్యాండ్ రైజ్ చేశావ్?.. షాకిబ్‌కి టాస్కు అర్థం కాలేదు.. కన్ఫ్యూజ్ అయ్యాడు.. మధ్యలో నేను కూడా హింట్ ఇచ్చాను.. మ్యాగ్జిమం అమౌంట్ ఉండాలని చెప్పాను.. నువ్వు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశావ్.. ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చి.. ఇది తప్పు.. అన్ ఫెయిర్ అని చెప్పే సీన్ నీకు లేదు.. వెళ్లి కూర్చో అని ఎడాపెడా వాయించాడు. ఈ మాత్రం దానికి ఎందుకు పిలిచారు అంటూ శ్రీజ గొణుక్కుంటూ వెళ్లిపోయింది. అలా ఈ నాలుగో ఎపిసోడ్ ముగిసే సరికి హరీష్, శ్రీజ, పవన్, ప్రియ, కల్కి ఇలా ఐదుగురు గోల్డెన్ చెయిర్‌లో కూర్చున్నారు. మరి నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఎలాంటి టాస్కులు వస్తాయో.. ఇంకెవరు టాప్ 15లోకి వస్తారో.. ఇందులోంచి చివరగా బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారో చూడాలి.