ఇన్ఫినిటీ మనీని ప్రైజ్ మనీ గా గెలుచుకునే అవకాశాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హౌస్ మేట్స్ కు ఇస్తున్నాం అంటూ బిగ్ బాస్ బుధవారం నుంచి కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా 6 టాస్కులు పెట్టగా, మొత్తంగా 4.5 లక్షల ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. మరి ఈ ప్రైజ్ మనీని గెలుచుకోవడానికి హౌస్ మేట్స్ పాల్గొన్న టాస్కులు ఏంటి? అందులో ఎవరు ఎంత ప్రైజ్ మనీని గెలుచుకున్నారు? అనే విషయాలపై ఒ లుక్కేద్దాం పదండి.
టాస్క్ లతో చుక్కలు చూపించిన బిగ్ బాస్
ముందుగా స్విమ్మింగ్ పూల్ టాస్క్ తో ఎపిసోడ్ ని మొదలు పెట్టారు బిగ్ బాస్. అందులో భాగంగా ప్రైజ్ మనీని గెలుచుకోవాలంటే హౌస్ మేట్స్ అలర్ట్ గా ఉంటూ, టీవీలో ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళు టాస్క్ లలో పాల్గొని గెలవాలని ముందుగానే చెప్పారు. ఇక స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో సోనియా, విష్ణు ప్రియ, మణికంఠ పేర్లు రాగా.. విష్ణు ప్రియ విన్ అయింది. ఆ అవకాశం వాల్యూ రూ. 25000గా ప్రకటించారు బిగ్ బాస్. రెండవ టాస్క్ తాడును విడవకుండా బంతిని బాస్కెట్ లో వేయడం. దీని విలువ రూ. 50, 000 వేలు. ఇందులో నిఖిల్, పృథ్వీల మధ్య గట్టి పోటీ జరగగా, చివరకు నిఖిల్ విన్ అయ్యాడు. మూడవ టాస్క్ స్పెల్లింగ్ రైటింగ్. దీని విలువ రూ. 70,000. ఇందులో మణికంఠ, యశ్మీ గౌడ, నైనిక పాల్గొనగా మణికంఠ విన్ అయ్యాడు. నాలుగో టాస్క్ ఆరెంజ్ జ్యూస్ ని కిందపడకుండా గ్లాస్ లో పోయడం. దీని విలువ రూ. 1,50,000. ఇందులో నిఖిల్, అభయ్, ఆదిత్య పాల్గొనగా.. నిఖిల్, అభయ్ గెలిచారు. ఐదో టాస్క్ అబ్బాయిలు వ్యాక్సింగ్ చేసుకోవడం. ఈ టాస్క్ లో నిఖిల్, పృథ్వి, నబిల్ పాల్గొనగా.. నబిల్ విన్ అయ్యాడు. ఇక చిట్ట చివరగా రూ. 100000 విలువైన ఆరవ టాస్క్, సాక్స్ ను కాలి నుంచి విడిపోకుండా చూసుకోవడం. ఇందులో ప్రతి క్లాన్ నుంచి ఇద్దరిద్దరు సభ్యులు పాల్గొనగా, అభయ్, నిఖిల్ గెలిచారు.
మొత్తంగా చూసుకుంటే ఈ 6 టాస్కులకు గాను బిగ్ బాస్ 4.5 లక్షలు అనౌన్స్ చేశారు. అయితే ఇందులో నైనిక టీం కేవలం 25 వేలు మాత్రమే సంపాదించుకుంది. నిఖిల్ టీం జ్యూస్ టాస్క్ తో పాటు సాక్స్ టాస్క్ లో 75,000 + 50000 గెలుచుకున్నారు. చివరగా యశ్మీ గౌడ టీం కూడా సేమ్ ప్రైజ్ మనీ సంపాదించుకుంది. మరి హౌస్ లో ఎక్కువగా ప్రైజ్ మనీని గెలుచుకుంది ఎవరు అంటే నిఖిల్ అండ్ యష్మీ క్లాన్ సభ్యులు. అయితే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ గెలుచుకున్న ప్రైజ్ మనీ సమానంగా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఇంకా ఏదైనా ట్విస్ట్ పెడతాడా అనేది చూడాలి. నిజానికి నిఖిల్ రూల్స్ ను బ్రేక్ చేసి ఉండకపోతే మరో రెండు టాస్క్ లలో విన్ అయిన మనీ అంతా నిఖిల్ క్లాన్ లోనే యాడ్ అయ్యేది. అప్పుడు ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకున్న క్లాన్ గా నిఖిల్ టీం గెలిచేది.