Bigg Boss 8 Telugu Promo 3: టాస్క్‌లతో చుక్కలు చూపిస్తున్న బిగ్ బాస్... నిఖిల్‌కు గాయం, టచ్ చేస్తే వెళ్లిపోతానని అభయ్ ఛాలెంజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 11వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో హౌజ్ మేట్స్ ఫిజికల్ కావడంతో నిఖిల్ కాలికి గాయం అయ్యింది. ఇంకా ప్రోమో విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి

Continues below advertisement

రోజుకు కనీసం రెండు మూడు ప్రోమోలను రిలీజ్ చేసి ఆడియన్స్ కు ఆ రోజు రాత్రి స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటిని పెంచేస్తున్నారు బిగ్ బాస్. పూట పూటకో ప్రోమోతో, అందులోనూ ట్విస్టులు, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే హౌస్ లో జరుగుతున్న టాస్క్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్ మేట్స్ ఫిజికల్ అయినట్టుగా కనిపిస్తోంది. అభయ్ వల్ల నిఖిల్ కాలు విరగినట్టుగా ప్రోమోలో చూపించారు. అసలు ఈ ప్రోమోలో ఏముందో తెలుసుకుందాం పదండి.

Continues below advertisement

లక్ష రూపాయల టాస్క్ లోనూ రచ్చ 
ముందుగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన మొదటి రెండు ప్రోమో లలో పెద్దగా వయొలెన్స్ ఉన్నట్టుగా అనిపించలేదు. అందులో దాదాపు 5 టాస్క్ లు ఉండగా, కేవలం 5 వ టాస్క్ లో నిఖిల్, పృథ్వీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇక నిఖిల్ ఎంతకూ తగ్గకపోవడం, పృథ్వీ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో వారిద్దరి మధ్య జరిగిన ఫైట్ కుస్తీ పోటీని తలపించింది. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన మూడో ప్రోమోలో మాత్రం హద్దులు దాటారు అన్నట్టుగా ఉంది. లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆరవ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో చివరి వరకు కాళ్ళకి సాక్స్ ఉండేలా చూసుకోవాలని రూల్ పెట్టారు. అయితే రెడ్ లైన్ దాటిన వారు ఈ టాస్క్ లో అవుట్ అయినట్టు. ఈ క్రమంలోనే ప్రోమోలో టాస్క్ స్టార్ట్ కాగా మొదట్లోనే పృథ్వీ, మణికంఠ అవుట్ అయినట్టుగా చూపించారు. అలాగే అభయ్ కిందపడ్డాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఆపై గేమ్ లో గెలవడం కోసం వయోలెంట్ గా మారి విష్ణుప్రియను పక్కకి నెట్టేసాడు అభయ్. అయితే ఇక్కడ ఆ తోపులాటలో ఏం జరిగిందో తెలియదు కానీ "నేను టచ్ చేశాను అని బిగ్ బాస్ అంటే ఈ షోలో నుంచి వెళ్ళిపోతాను" అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అభయ్. 

Read Also : Citadel Diana OTT Release Date: ఓటీటీలోకి ఫ్యూచరిస్టిక్ స్పై థ్రిల్లర్ 'సిటాడెల్ డయానా' - ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

రెండవ లెవెల్ లో గాయపడ్డ నిఖిల్
రెండవ లెవెల్ గేమ్ లో నిఖిల్ కి గాయాలు అయ్యాయి. గేమ్ లో భాగంగా చివరగా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్ల కాలికి ఒక్కో సాక్స్ ఉంచుకుని, దాన్ని చివరి వరకు కాపాడుకోవాలని చెప్పారు బిగ్ బాస్. అయితే ఇందులో నబిల్ అవుట్ అయ్యాడని సంచాలక్ ప్రేరణ చెప్పగా అతను ఒప్పుకోలేదు. చివరికి అభయ్, నిఖిల్ మిగలగా, ఇద్దరూ ఫిజికల్ అయ్యారు. నిఖిల్ ఎలాంటి దాడి చేయకపోయినా అభయ్ నిఖిల్ కాలిని తొక్కాడు. ఆ తర్వాత నిఖిల్ కాలు తిరగబడి, తీవ్ర గాయం అయినట్టుగా ప్రోమో చివర్లో చూపించారు. మరి నిఖిల్ కు అయిన గాయం చిన్నదేనా? అసలు గేమ్ లో ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సి.

Read Also :Bigg Boss Telugu Season 8 Promo: ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ కోసం బొక్క బోర్లా పడ్డ సోనియా... నిఖిల్, పృథ్వీ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్, మనీ కోసం కుస్తీ

Continues below advertisement