Bigg Boss 8 Telugu Episode 23 Day 22 written Review 4th Week Nomination: బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ దుమ్ము లేచిపోయింది. ఒక్కొక్క కంటెస్టెంట్ అరుచుకుంటూ తమ తమ పాయింట్లను బయటపెట్టారు. ఈ క్రమంలో ఆదిత్యను అందరూ సాఫ్ట్ టార్గెట్ చేశారు. ఇక మణికంఠను వీక్ అనే పాయింట్ చెప్పి అందరూ టార్గెట్ చేశారనిపిస్తుంది. ఇక సోనియా, పృథ్వీ, నిఖిల్ గ్రూపు అని మరోసారి ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా రుజువైంది. సోనియా పప్పెట్స్‌లా పృథ్వీ, నిఖిల్ ఉన్నారనిపిస్తుంది. ఈ నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ఎలా సాగిందంటే..


ముందుగా ఆదిత్య వచ్చి పృథ్వీ, సోనియాను నామినేట్ చేశాడు. బూతులు మాట్లాడుతున్నావ్ అని చెప్పి పృథ్వీని, మైకులు వదిలేసి గుసగుసలు పెడుతున్నావ్ అని సోనియాని నామినేట్ చేశాడు. ఆ తరువాత నైనిక వచ్చి మణికంఠను నామినేట్ చేసింది. 'నేను ఏదో బాధలో ఉంటే.. వెళ్లిపోతావ్, ఎలిమినేట్ అవుతావ్ అని డీమోటివేట్ చేశావ్' అని మణిని నామినేట్ చేసింది. 'ప్రతీ టాస్కుకి ప్రాణం పెట్టి ఆడాలి... కానీ మీరు అంతగా ఆడటం లేదనిపిస్తోందం'టూ ఆదిత్యని నైనిక నామినేట్ చేసింది.


నబిల్ నామినేషన్ ప్రక్రియ కాస్త సుదీర్ఘంగా సాగింది. సోనియాను నామినేట్ చేస్తూ వాగ్వాదానికి దిగాడు. 'నువ్వు ఫేక్ నువ్వు ఫెయిల్ సంచాలక్' అంటూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. 'నువ్వు మాట్లాడకుండా... పృథ్వీ, నిఖిల్‌లతో మాట్లాడిస్తున్నావ్' అంటూ కారణాలు చెప్పాడు. పృథ్వీ మాటల్లో 'లైన్ క్రాస్ చేస్తున్నావ్.. నీ టోన్ నచ్చడం లేదు' అంటూ అతడ్ని నామినేట్ చేశాడు. ఆ తరువాత ప్రేరణ వచ్చి మణికంఠను దోశ విషయంలో నామినేట్ చేసింది. నైనిక ఆటలో, ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదని ఆమెను నామినేట్ చేసింది.


సోనియా వచ్చి నబిల్‌ను తిరిగి నామినేట్ చేసింది. 'ఫెయిల్ సంచాలక్' అంటూ పదే పదే అతడిపై రుద్దింది. 'సంచాలక్ అయ్యాక నీ యాటిట్యూడ్ నచ్చలేదు' అంటూ నామినేట్ చేసింది. 'మీరు ఇక్కడకు రావడమే గొప్ప అని అనుకుంటున్నారు.. టాస్కులంటే ఇష్టం లేనట్టు, ఆసక్తి లేనట్టు ఉంటున్నారు' అని కారణాలు చెప్పి ఆదిత్యను నామినేట్ చేసింది. పృథ్వీ ఫిజికల్‌గా హర్ట్ చేస్తున్నాడని మణికంఠ నామినేట్ చేశాడు. ఆదిత్య పదే పదే ఎక్కువగా సలహాలు ఇస్తున్నాడని నామినేట్ చేశాడు.


'మీకు టాస్కులో సపోర్ట్ చేయడం లేదని హర్ట్ అయ్యారు.. అది నచ్చలేద'ని ఆదిత్యని నామినేట్ చేసింది విష్ణు ప్రియ. 'ఎగ్స్ కోసం నామినేట్ చేశావ్.. బీప్ పదం వాడిన వాళ్లని వదిలేశావ్.. అది నాకు నచ్చలేదు' అంటూ ప్రేరణని నామినేట్ చేసింది. పృథ్వీ వచ్చి నబిల్‌ను నామినేట్ చేశాడు. సంచాలక్‌గా ఫెయిల్, పక్షపాతం చూపించాడని కారణాలు చెప్పాడు. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా వీక్ అని మణిని నామినేట్ చేశాడు. ఆ తరువాత సీత తన కారణాలు చెబుతూ ప్రేరణని, మణికంఠని నామినేట్ చేసింది. 'టాస్కులో నా ఎమోషన్ తప్పు అన్నావ్.. నీ ఎమోషన్ కూడా తప్పే' అని ప్రేరణని నామినేట్ చేసింది. ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కావడం లేదంటూ మణిని నామినేట్ చేసింది.


Also Read: బిగ్​బాస్​కి మూడో కంటెస్టెంట్​గా వెళ్లాడు.. మూడో వారంలోనే వచ్చేశాడు.. అభయ్ నవీన్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?



ఫిజికల్‌గా వీక్ అంటూ మణిని యష్మీ నామినేట్ చేసింది. కానీ మణి మాత్రం ఆ రీజన్‌ను ఒప్పుకోలేదు. 'నేను నా వరకు ఎంత వీలవుతుందో అంత ఫైట్ చేశాను' అని అన్నాడు. అలా చివరకు ఇద్దరి మధ్య మాటామాట పెరిగి... 'ఇంట్లో ఉంటే నువ్వుండాలి లేదా నేనుండాలి' అంటూ మణికి యష్మీ సవాల్ విసిరింది. ఆ తరువాత సోనియాను నామినేట్ చేస్తూ... 'నువ్వు ఆటల్లో ముందుకు రాకుండా.. పృథ్వీ, నిఖిల్‌ను ముందుకు పెట్టి ఆడుతున్నావ్' అంటూ కారణాలు చెప్పింది యష్మీ. 'నువ్వు వాళ్లిద్దరినే కాకుండా మమ్మల్ని కూడా చూస్తే టాస్కులు ఆడామా? లేదా? అన్నది తెలుస్తుంది' అంటూ యష్మీకి సోనియా కౌంటర్ వేసింది. 


'నేను ఇక్కడ ఉన్న ఎవరికీ  తక్కువ కాదు.. ఆట ఆడితే.. ఎవరినో ఒకరిని కొడతాను.. గొడవలు ఎందుకు అని వదిలేస్తున్నా' అంటూ సోనియా కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. సోనియా గ్రూపు, తన పప్పెట్స్‌ను ఈ ఎపిసోడ్‌లో, నామినేషన్ ప్రక్రియలో ఆడియెన్స్ అంతా గమనించొచ్చు. 'ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో నీకు తెలుసు' అంటూ సోనియా మీద యష్మీ సెటైర్ వేసింది. ఇక చివరకు నిఖిల్ తనకు వచ్చిన పవర్‌తో నైనికను సేవ్ చేశాడు. అలా ఈ నాలుగో వారంలో పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణలు నామినేషన్‌లోకి వచ్చారు. మరి ఈ వారంలో ఎవరు బయటకు వస్తారన్నది చూడాలి.


Also Read - Bigg Boss 8 Telugu Episode 21 Day 20: హగ్గులు కాదు ఆటలు ఆడు... మణికంఠకు విష్ణు స్వీట్ వార్నింగ్, ప్రేరణ దోశ పంచాయితీ తేల్చిన నాగ్