Bigg Boss 8 Telugu Episode 15 Day 14 Written Review Shekar Basha Elimination: బిగ్ బాస్ రెండో వారం వీకెండ్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. సండే ఫండే అని అందరికీ తెలిసిందే. ఎలిమినేషన్ కంటే ముందు కంటెస్టెంట్లతో ఆటలు ఆడిస్తుంటాడు నాగ్. ఈ సారి టాస్కుల కంటే ముందుగా.. క్లాన్స్‌ను విభజించాడు. బిగ్ బాస్ ఇంట్లో మూడో వారంలో ఇక రెండు క్లాన్స్ ఉంటాయి.. వాటికి శక్తి, కాంతార అని పేర్లు కూడా పెట్టారు. నిఖిల్ శక్తి క్లాన్‌లోకి విష్ణు ప్రియ, పృథ్వీ, సోనియా, శేఖర్ బాషా, సీత, నయనికలు వచ్చారు. మిగిలిన వారంతా అభయ్ కాంతార క్లాన్‌లోకి వెళ్లారు. సండే ఫండే కాబట్టి.. కంటెస్టెంట్లతో ఆటలు ఆడించేందుకు నాగ్ రెడీ అయ్యాడు. అంతకంటే ముందుగా విష్ణు ప్రియ సేవ్ అయినట్టుగా చెప్పేశారు. ఇక సోనియా, విష్ణు ప్రియలు హగ్ చేసుకోవడంపై నాగ్ స్పెషల్‌గా కామెంట్ చేశాడు.
Read Also : హౌజ్‌మేట్స్‌కి బిగ్ ట్విస్ట్, ఎలిమినేషన్‌ని వారి చేతుల్లోనే పెట్టిన హోస్ట్,
చిత్రం విచిత్రం అనే టాస్కు పెట్టాడు. ఇందులో రెండు చిత్రాలను చూపిస్తాడు. ఆ రెండు చిత్రాలను కలిపితే ఒక పదం వస్తుంది.. ఆ పదం ఏంటో చెప్పాల్సి ఉంటుందని, తప్పుగా చెబితే మైనస్ పాయింట్ ఉంటుందని అన్నాడు. ఈ టాస్కులో విష్ణు ప్రియ వల్ల నిఖిల్ క్లాన్‌కు మైనస్ మార్కులు పడ్డాయి. సీత వెనకలా నుంచి హింట్ ఇస్తుండటంతో మళ్లీ మైనస్ మార్కులు పడ్డాయి. చివరకు నాగార్జున ఈ రెండు టీంకు టై పడేలా చూశాడు. ఎవరైనా బ్రేకప్ స్టోరీ చెబుతారో వాళ్ల టీం విన్ అవుతుందని అన్నాడు. దీని కంటే ముందు విష్ణు ప్రియ సేఫ్ అయిందని ప్రకటించారు.
ఇక నిఖిల్ క్లాన్ నుంచి సీత తన బ్రేకప్ స్టోరీ చెప్పింది. ఐదేళ్లు రిలేషన్‌లో ఉన్నానని, పెళ్లి వరకు వచ్చిందని, ఆ వ్యక్తి తనను ఏడాదిగా మోసం చేస్తున్నాడని తెలుసుకున్నానని సీత చెప్పుకొచ్చింది. తరువాత డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఆ టైంలో ఆరు నెలల్లోనే 14 కేజీలు తగ్గానని చెప్పింది. ఆ తరువాత సైక్రియార్టిస్ట్ దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నానని, అందరితో కలవడం ప్రారంభించానని, చివరకు దాన్నుంచి బయటకు వచ్చానని.. అలా బ్రేకప్ అవ్వడమే మంచిదని ఇప్పుడు అనిపిస్తోందంటూ ఇన్ స్పైరింగ్ స్టోరీని చెప్పింది సీత. మనకు ఏది బెస్ట్.. మనకు ఏది రావాలో అదే వస్తుందంటూ సీతకు ధైర్యాన్ని చెప్పాడు నాగ్. ఆ తరువాత మళ్లీ సేవింగ్ ప్రాసెస్ అని చెప్పి సీత, పృథ్వీలు సేఫ్ అని చెప్పేశాడు.
చివరకు ఆదిత్య, శేఖర్ బాషాలు మిగిలారు. ఈ ఇద్దరిలోంచి ఎవరు వెళ్లాలి? ఎవరు ఉండాలి? అనేది కంటెస్టెంట్లు నిర్ణయిస్తారని కాసేపు ఆట ఆడించాడు నాగ్. చివరకు మిగిలిన ఇద్దరి కంటెస్టెంట్లలో శేఖర్ బాషాకి సీత మాత్రమే ఓటు వేస్తుంది. మిగిలిన వారంతా కూడా ఆదిత్యకు ఓటు వేస్తారు. శేఖర్ బాషా తన బిడ్డ కోసం ఆలోచిస్తున్నాడని, గేమ్ మీద ఫోకస్ పెట్టడం లేదనే కారణాన్నే ఎక్కువ మంది చెప్పారు. ఆదిత్యకు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలి.. ఆట ఆడాలి.. గెలవాలి అనే కసి ఉందని అందుకే ఓటు వేస్తున్నామని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు.
Read Also : శేఖర్ భాషా మెరుపుల్, విష్ణు ప్రియ అరుపుల్... బిగ్ బాస్ హౌస్‌లో ‘చిత్రం విచిత్రం’
ఇక చివరకు స్టేజ్ మీదకు శేఖర్ బాషా ఎలిమినేటర్ అయి వచ్చాడు. శేఖర్ బాషా బయటకు వెళ్తుంటే.. సీత వెక్కి వెక్కి ఏడ్చేసింది. చివరకు స్టేజ్ మీదకు వచ్చిన శేఖర్ బాషాతో నాగ్ ఆట ఆడించాడు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో రియల్ ఎవరు? ఫేక్ ఎవరు? అని ముగ్గురు కంటెస్టెంట్ల గురించి చెప్పమన్నాడు. సీత నా చెల్లి లాంటిది.. చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్.. గుండెల్లోంచి మాట్లాడుతుంది.. విష్ణు ప్రియ.. ఇన్నోసెన్స్‌కి పర్యాయపదంలా ఉంటుంది.. చాలా అమాయకురాలు.. విష్ణు ప్రియ గురించి బయట ఏదేదో చెప్పారు.. కానీ ఇంత అమాయకురాలా? అని అనుకున్నా.. ఎలా బతుకుతుందో ఏమో.. అనిపిస్తుంది. ప్రేరణ.. చాలా మంచి వ్యక్తి.. కొన్ని నచ్చవు కానీ చాలా మంచిది.. వయలెన్స్‌ను ఆపదు.. జెన్యూన్ వ్యక్తి అని చెప్పుకొచ్చాడు.
ఇక ఫేక్ కేటగిరీలో.. సోనియా నవ్వు ప్రశాంతంగానే అనిపిస్తుంది.. కానీ తరువాత నామినేషన్‌లో మహాంకాళిని చూశా.. మణికంఠ.. కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు.. చాలా ఆలోచించి ఎలా రియాక్ట్ అవ్వాలో అవుతాడు.. క్యాలిక్యులేటెడ్.. ఆదిత్య.. నామినేషన్ చేసినందుకు సూటి పోటి మాటలు మాట్లాడాడు.. అని చెప్పుకొచ్చాడు.