తొలివారం చప్పగా సాగిన బిగ్‌బాస్ 8 తెలుగు రెండో వారం చాలా ఆసక్తిగా సాగింది. కంటెస్టెంట్స్‌కి ఊహించని ట్విస్టులు, టాస్క్‌లతో చుక్కలు చూపించాడు బిగ్‌బాస్. దీంతో కంటెస్టెంట్స్ కూడా తమ తీరును మార్చుకుని టాస్క్‌ల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. తొలివారం గేమ్స్ ఆడకుండ మాటలు చెబుతూ గడిపిన నాగ మణికంఠ రెండోవారం తన గేమ్స్‌తో హౌజ్‌మేట్స్‌కి షాకిచ్చాడు. కిరాక్ సీత, విష్ణుప్రియలు టఫ్ ఫైట్ ఇచ్చారు. నిఖిల్ చీఫ్ సక్సెస్ అయ్యాడు. యష్మీ గౌడ్, నైనికలు ఫెయిల్ అవ్వడం వారి క్లాన్‌ని డిస్సాల్వ్ చేశాడు హోస్ట్ నాగార్జున. రెండో వారంలో తప్పులు చేసిన వారి, మాటలు జారిన వారికి చివాట్లు పెట్టారు.
కొత్త చీఫ్ నియమాకం
ఇలా శనివారం ఎపిసోడ్ ముచ్చట్లు ఆసక్తిగా సాగాయి. ఇక నేడు సన్‌డే ఫన్‌డే కాబట్టి కంటెస్టెంట్స్‌తో కాస్తా ఎంటర్‌టైన్ చేశారు హోస్ట్ నాగార్జున. తాజాగా నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రొమోలో నైనిక, యష్మీ గౌడ క్లాన్‌లను డిస్సాల్వ్ చేసి కొత్త చీఫ్‌గా అభయ్ నవీన్‌ని నియమించిన సంగతి తెలిసిందే. ఇలా నిఖిల్, అభయ్‌లు చీఫ్‌లు రెండు క్లాన్స్‌ని ఏర్పాటు అయ్యాయి. దీంతో నేటి ఎపిసోడ్ తమ చీఫ్‌లను ఎంచుకునే అవకాశం హౌజ్‌మేట్స్‌కే ఇచ్చారు హోస్ట్. ఇలా ఒక్కొక్కొరుగా తమ చీఫ్‌గా ఎంచుకుని దానికి తగిన కారణాలు చెప్పాలి.
నిఖిల్ కి సోనియా గైడెన్స్
తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో హోస్ట్ నాగ్ సోనియాని కాస్తా ఆటపట్టించాడు. ఆ వయసు అంటే చెప్పమ్మా అనగానే సోనియా సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏ క్లాన్‌కి వెళతావని అడగ్గానే నిఖిల్‌ను ఎంచుకుంది. ఎందుకంటే తన అవసరం, గైడేన్స్ నిఖిల్‌కే ఎక్కువగ అవసరం అనిపిస్తుందని చెప్పడంతో నిఖిల్ కాస్తా మోహమామట పడుతున్నట్టు కనిపించాడు. దీంతో నిఖిల్ క్లాన్‌లోకి విష్ణు ప్రియ, సోనియా ఆకుల, కిరాక్ సీత, శేఖర్ భాషా, ప్రథ్విరాజ్‌లు నిఖిల్ టీంని ఎంచుకున్నారు. ఇక నాగ మణికంఠ, నబీల్, ఆదిత్య ఓం, ప్రేరణ, యష్మీ గౌడలు అభయ్ క్లాన్‌లోకి వెళ్లారు.
సన్‌డే ఫన్‌డే.. ఎలిమినేషన్
సన్‌డే అంటే ఫన్‌డే మాత్రమే కాదు. ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలిసిందే. రెండోవారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకు రావాల్సిందే. ఈ ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుందనే విషయం తెలిసిందే. నామినేషన్‌లో ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారు హౌజ్‌ను విడాలి. అయితే బిగ్‌బాస్ 8 అంటే అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు ముందునుంచి హోస్ట్ చెబుతూనే ఉన్నారు. ఇక ఈ రెండో వారం హౌజ్‌మేట్స్‌కి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
ఈసారి బయటకు పంపించే కంటెస్టెంట్‌ని ఆడియన్స్ కూడా హౌజ్‌మేట్స్ నిర్ణయించాలని వారిని ఇరకాటంలో పడేశారు హోస్ట్. అలా హౌజ్‌మెట్స్ ఒక్కొక్కరుగా వచ్చిన తమ అభిప్రాయన్ని చెప్పి ఆ కంటెస్టెంట్ పేరు. అలా ఎక్కువ మంది ఎవరిని రిజెక్ట్ చేస్తే వారు హౌజ్‌ని విడాల్సి ఉంది. అలా ఈ రెండో వారం లాచిక్ లెస్ జోక్స్ చిరాకు పెట్టించే శేఖర్ భాషా ఎలిమినేట్ కానున్నాడు. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే. నేటి ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే.
Also Read: కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పిన కిరాక్ సీత - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?