Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇప్పుడు ఐదవ వారం నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలకు సంబంధించిన టాస్క్ లతో ఈ వారాన్ని నెట్టుకొస్తున్నారు. అందులో భాగంగా చిన్నచిన్న గేమ్స్ పెట్టి వైల్డ్ కార్డు ఎంట్రీలు రాకుండా ఆపే ఛాన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్. అయితే గత రెండు మూడు టాస్కులు మాత్రం చిన్న పిల్లల ఆటల్లాగా ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ఏకంగా 'కలర్ కలర్ విచ్ కలర్' అంటూ హౌస్ మేట్స్ ని చిన్నపిల్లల్ని చేసేసాడు బిగ్ బాస్. తాజాగా రిలీజ్ అయిన డే 31 ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి. 


కలర్ కలర్ విచ్ కలర్... టాస్క్ 
బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ అంటూ 'కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్' అనే టాస్క్ ను హౌస్ మేట్స్ కు ఇచ్చారు. అందరూ హుషారుగా టాస్క్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక బిగ్ బాస్ 'మీకు ఒక కలర్ చెప్తాను. ఆ కలర్ ఉన్న వస్తువుని మీ ఆపోనెంట్ కంటే ముందుగా తీసుకొచ్చి అక్కడున్న బాక్స్ లో పెట్టిన వారే విన్' అని క్లియర్ గా వివరించారు. ఇక ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేయగా, గెలిచిన వాళ్ళు ఏం చెప్తే ఓడిన వాళ్ళు పనిష్మెంట్ గా అది చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇందులో మణికంఠ, పృథ్వి, నబిల్ హైలెట్ గా నిలిచారు. ఈ ముగ్గురూ ఓడిపోయి పనిష్మెంట్ కింద చేసిన టాస్కులు ఫన్నీగా ఉన్నాయి. 


Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే 


పాపం నబిల్... అదరగొట్టిన మణికంఠ, పృథ్వీ
ముందుగా టాస్క్ లో ఓడిపోయిన నబిల్ గురించే మాట్లాడాలి. ఆయనకు వచ్చిన కష్టం అలాంటిది మరి. ప్రోమోలో ఫస్ట్ టాస్క్ ను ఆదిత్య ఓం, నాగమణికంఠ మొదలుపెట్టారు. 'కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్' అని అడగ్గా, బిగ్ బాస్ బ్లాక్ కలర్ చెప్పారు. ఇద్దరూ బ్లాక్ వస్తువుల కోసం వెతికారు. కానీ అంతలోనే ఆదిత్య తన చెప్పుని ఆ బాక్స్ లో వదిలేసారు. మరోవైపు మణికంఠ తన బ్యాగ్ ని అందులో పారేశారు. కానీ ముందుగా ఆదిత్య చేయడంతో మణికంఠకు ఐటెం సాంగ్లో డాన్స్ చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు ఆదిత్య. అయితే డాన్స్ రాకపోయినా 'సూపర్ మచ్చి' అనే పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ చేసి నవ్వించాడు మణికంఠ. ఆ తర్వాత నిఖిల్, నబిల్ గేమ్ ఆడగా, నబిల్ ఓడిపోయాడు. అయితే బిగ్ బాస్ నబిల్ కి ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు. పనిష్మెంట్ గా స్పూన్ సాయంతో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ ని బకెట్లో నింపాలని చెప్పడంతో షాక్ అయ్యాడు నబిల్. ఈ టాస్క్ ను కంప్లీట్ చేయడానికి నబిల్ పడిన కష్టం చూస్తే అది పగవాడికి కూడా రావద్దు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత పృథ్వీ ఓడిపోవడంతో అతడిని ఏకంగా లేడీ డ్రెస్ వేసి, హీల్స్ వేసుకొని వాక్ చేయమని చెప్పారు. మొత్తానికి ప్రోమో ఫుల్ ఫన్ తో ఎంటర్టైనింగ్ సాగింది. రిలీజ్ అయిన క్షణాల్లోనే ఈ ప్రోమో వైరల్ గా మారింది. మరి కంప్లీట్ ఎపిసోడ్ చూడాలంటే మాత్రం ఈరోజు రాత్రి దాకా ఆగాల్సిందే.


Read Also : NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్... 'దేవర'ను మించి స్టోరీ - 'డ్రాగన్' కథ ఇదేనా?