Bigg Boss 8 Telugu Day 23 Promo 2 : చీఫ్ టాస్క్ తో అగ్నికి ఆజ్యం పోసిన బిగ్ బాస్... కొత్త చీఫ్ ఎవరంటే? 

Bigg Boss Telugu News | బిగ్ బాస్ సీజన్ 8 డే 23 రెండవ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో రెండవ చీఫ్ కోసం బిగ్ బాస్ పెట్టిన కొత్త థీమ్ టాస్క్ చూస్తుంటే మళ్లీ హౌస్ మేట్స్ మధ్య గొడవలు ఖాయం అన్పిస్తోంది.

Continues below advertisement

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు నాలుగో వారం నామినేషన్స్ హిట్ సోమవారం ఎపిసోడ్లో గట్టిగానే కనిపించింది. తాజాగా డే 23కి సంబంధించిన రెండవ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కాంతారా టీంకు చీఫ్ కావడం కోసం కొత్తగా పెట్టిన టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య ఆల్రెడీ రగులుతున్న గొడవలకు ఆజ్యం పోసినట్టుగా కనిపించింది. మరి ఆ టాస్క్ ఏంటి? కొత్త చీఫ్ ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

కొత్త చీఫ్ కోసం కొత్త టాస్క్ 
నిన్నటి ఎపిసోడ్ లో నబిల్, యష్మి గౌడలు కలిసి సోనియాను టార్గెట్ చేశారు. ఇద్దరూ కలిసి చిన్నోడిని, పెద్దోడిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతోందంటూ ఆమె ఆడుతున్న గ్రూప్ గేమ్ గురించి చెప్పి చుక్కలు చూపించారు. ఇక మిగిలిన వాళ్లంతా ఆదిత్య ఓంను నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఆడారు. పాపం ఆయన మాత్రం తన మాటను నామినేషన్స్ లో తప్ప ఎక్కడా ఎవ్వరూ వినరు అంటూ ఆవేదన వ్యక్తం చేసి సైలెంట్ అయిపోయారు. ఇక నామినేషన్స్ అయిపోయాక కూడా యష్మి గౌడ, సోనియా మధ్య జరిగిన రచ్చను ఈరోజు రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో చూపించారు.

తాజా ప్రోమోలో "రెండవ చీఫ్ ని ఎంపిక చేసుకునే సమయం వచ్చేసింది. పది బొమ్మలు మీ ముందు ఉన్నాయి. అందులో చివరికి ఏ సభ్యుడి బొమ్మ అయితే మిగులుతుందో వారే కొత్త చీఫ్" అంటూ కంటెస్టెంట్స్ చేతికి సుత్తిని ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఆ సుత్తిని సొంతం చేసుకునే బాధ్యతను మాత్రం బాయ్స్ చేతుల్లోనే పెట్టారు. సుత్తిని ఎవరు తీసుకుంటారో వాళ్ళు తమకు నచ్చిన కంటెస్టెంట్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సుత్తి పట్టుకున్న కంటెస్టెంట్ ఎవరు అనర్హులో చెబుతూ వాళ్ళ బొమ్మను పగలగొట్టాల్సి ఉంటుంది. 

Read Also : Bigg Boss 8 Telugu Episode 23 Day 22: ఉంటే నువ్వుండాలి లేదా నేనుండాలి... మణికంఠ, యష్మీ సవాల్ - సోనియా ఓవర్ కాన్ఫిడెన్స్

ఆజ్యం పోసిన బిగ్ బాస్ 
ముందుగా ఆదిత్య సుత్తి పట్టుకుని పృథ్వికి ఇచ్చాడు. క్లాన్ ను ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ నీకు లేదు అంటూ మణికంఠ బొమ్మను పగలగొట్టాడు పృథ్వీ. ఆ తర్వాత సుత్తి కిరాక్ సీత చేతికి వెళ్ళగా, ఆమె నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు అంటూ యష్మి గౌడ బొమ్మని పగల గొట్టింది. ఆ తర్వాత సుత్తి సోనియా చేతికి అండగా, ఆమె "నబిల్ నీలో లీడర్ షిప్ స్కిల్స్ ఎప్పుడూ చూడలేదు" అంటూ అతని బొమ్మను పగల గొట్టింది. నెక్స్ట్ నైనిక "నీకు చీఫ్ కావాలన్న ఎంతుజియాజమ్ తక్కువగా ఉంది" అంటూ విష్ణు ప్రియ బొమ్మను పగల గొట్టింది. ఇక చివరగా సుత్తి కిరాక్ సీత చేతికి వెళ్ళగా "మీరిద్దరూ ఆల్రెడీ చీఫ్ అయ్యారు, ప్రేరణకు, నాకు మధ్య ఫెయిర్ ఛాన్స్ ఉండాలని అనుకుంటున్నాను" అని చెప్పింది. అయితే చివరకు ఆమె ప్రేరణ బొమ్మని పగలగొట్టినట్టుగా కనిపించింది. మొత్తానికి ప్రోమో చూస్తుంటే కిరాక్ సీత కాంతారా చీఫ్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు బొమ్మలు పగలగొడుతూ కంటెస్టెంట్స్ చెప్పిన రీజన్స్ మళ్లీ మంట పెట్టేలా కన్పిస్తున్నాయి. 

Read Also : Bigg Boss 8 Telugu Day 23 Promo: నేను కావాలంటే నిఖిల్‌నే చూస్తా... సోనియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యష్మి గౌడ

Continues below advertisement
Sponsored Links by Taboola