Priyanka Jain Journey in Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లాంటి రియాలిటీ షోలోకి అందరూ వ్యక్తిగతంగానే వస్తారు. అంటే గ్రూపులుగా ఆడాలని, తమ గ్రూప్ వల్ల తమ గేమ్ మునిగిపోవాలని ఎవరూ అనుకోరు. కానీ ఒక్కొక్కసారి అలాంటి గ్రూప్స్ వల్లే కంటెస్టెంట్స్ గేమ్ దెబ్బతింటుంది. దీనికి బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక జైనే ఉదాహరణ. సీరియల్స్‌లో నటిగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రియాంకను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా చూడగానే.. చూడడానికి చాలా సెన్సిటివ్‌గా ఉందే. అసలు ఇలాంటి రియాలిటీ షోలో తన ఆటను చూపించగలదా? అందరితో పోటీపడి నిలబడగలదా? అని చాలామంది సందేహపడ్డారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో అందరు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయినా కూడా ప్రియాంక మాత్రమే గట్టిగా నిలబడి ఫైనల్స్ వరకు చేరుకుంది. కానీ ట్రోఫీకి మాత్రం చాలా దూరంలోనే ఆగిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు.


చివరి వరకు పట్టుదలతో..


హైట్ తక్కువ ఉన్న అమ్మాయిలకు పొట్టి అని ట్యాగ్ ఇవ్వడం అందరికీ అలవాటు అయిపోయింది. అలాగే ప్రియాంకకు కూడా పొట్టి ప్రియాంక అని పేరు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు. తన క్యూట్ లుక్స్‌లో హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే చాలామందిని ఫిదా చేసేసింది ఈ పొట్టి పిల్ల. ఎక్కువగా ఎవరితో గొడవపడకుండా, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడమే ప్రియాంక నైజం అని బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొన్నిరోజుల్లోనే చూసే ప్రేక్షకులకు అర్థమయ్యింది.


తనకు ఇచ్చిన హౌజ్ వర్క్ చేయడం, టాస్కులు ఆడడం, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం.. కొన్నాళ్ల వరకు బిగ్ బాస్ హౌజ్‌లో ఇదే ప్రియాంక రొటీన్. హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తానే కిచెన్ బాధ్యతలు ఎక్కువగా నిర్వర్తించింది. అంతమందికి ఏ మాత్రం విసుగులేకుండా వండిపెట్టేది. తనకు ఎవరూ సాయం చేయకపోయినా.. ఒంటరిగానే చాలాసార్లు అందరికీ వంట చేసి పెట్టింది ప్రియాంక.


అలా చేయాలంటే చాలా ఓపిక కావాలని, ప్రియాంకకు ఓపిక ఎక్కువే అని మొదట్లోనే ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. టాస్కుల విషయంలో కూడా తను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేది. పవర్ అస్త్రా కంటెండర్ అవ్వాలంటే జుట్టు కత్తిరించుకోవాలి అని చెప్పినప్పుడు అమర్.. దానికి ఒప్పుకోకపోయినా ప్రియాంక మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తన జుట్టును కత్తిరించుకొని ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. చాలాసార్లు పవర్ అస్త్రా రేసులో, కెప్టెన్సీ రేసులో చివరి వరకు వెళ్లి ఓడిపోయింది. దీంతో ప్రియాంక పట్టుదలకు చాలామంది ఫిదా అయ్యారు.


శోభాతో సావాసమే పెద్ద మైనస్


బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొత్తలో చాలావరకు అందరితో కలిసి ఉండడానికే ప్రియాంక ప్రయత్నించేది. కానీ మెల్లగా సీరియల్స్ బ్యాచ్ అంతా ఒక్కటయ్యి.. తనను కూడా ఆ బ్యాచ్‌లో కలిపేసుకున్నారు. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసే గుణం ప్రియాంకలో ఉంది. అదే ఇప్పుడు తనను ‘బిగ్ బాస్ సీజన్ 7’ టైటిల్ విన్నర్ అవ్వకుండా ఆపుతుంది. చాలావరకు తన ప్రవర్తన ఎప్పుడూ హౌజ్‌లో పాజిటివ్ వాతావరణమే తీసుకొచ్చేది.


కానీ ఒక నామినేషన్స్ సమయంలో శోభా శెట్టికి, భోలే షావలికి వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో అవసరం లేకపోయినా ప్రియాంక జోక్యం చేసుకుంది. తనకంటే వయసులో పెద్ద అయిన భోలేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్పటినుంచి ప్రియాంకపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ మొదలయ్యింది. అనవసరంగా అందరితో గొడవలు పెట్టుకునే శోభాను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ప్రియాంకపై నెగిటివిటీ పెరిగిపోతూ వచ్చింది.


ఫినాలే అస్త్రా సమయంలో తనకు ఎవరూ సపోర్ట్ చేయకపోయినా.. తను మాత్రం అమర్‌కు అండగా నిలబడింది. ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ వరకు చేరుకున్నా.. అమర్, శోభాలతో ఉన్న ఫ్రెండ్‌షిప్ వల్లే ప్రియాంక విన్నర్ అయ్యే ఛాన్సు కోల్పోయే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


Also Read: మెంటల్ టార్చర్, బ్లాక్ మెయిల్ నుంచి పేమెంట్ క్లియరెన్స్ వరకు - 'డెవిల్' లేటెస్ట్ కాంట్రవర్సీ