Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం ఎలిమినేషన్‌కు టైం వచ్చింది. ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఈ మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ బాగానే పెరిగింది. వీక్ కంటెస్టెంట్ అనుకున్న యావర్‌ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు. వరుసగా లేడీ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతున్నారు. ఈ మూడో వారంలో మగ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడేమో అని అంతా అనుకున్నారు.


అమర్ దీప్‌, యావర్‌లకు ముందు నుంచి మంచి ఓటింగ్ ఉంది. ఇక గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. కానీ ఈ సారి కూడా జనాలు లేడీ కంటెస్టెంట్‌నే ఇంట్లోంచి పంపేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ మూడో వారంలో ప్రియాంక, దామిని, శుభ శ్రీ, రతికలు నామినేషనల్‌లో ఉన్నారు. ఈ ముగ్గురిలో చూసుకుంటే దామిని, శుభ శ్రీలు వీక్ కంటెస్టెంట్లు. ఈ ఇద్దరికీ అంత క్రేజ్ గానీ ఫాలోయింగ్ గానీ లేదు. ఇక రతిక నెగెటివిటీ ఇమేజ్‌తోనే నెట్టుకుంటూ వస్తోంది. బిగ్ బాస్ బేబీ అంటూ అందరూ తిడుతున్నా గానీ ఆమెకు ఓట్లు బాగానే పడుతున్నాయి.


ఇక మిగిలిన దామిని, శుభ శ్రీలు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఈ మూడో వారంలో ఈ ఇద్దరికీ అతి తక్కువ ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దామిని ఎంతో కష్టపడి తన టాలెంట్ అంతా చూపిస్తోంది. అందాల ప్రదర్శనకు వెనకాడటం లేదు. కానీ ఆ టాలెంట్‌ను చూసి జనాలు ఓట్లు వేయలేదనిపిస్తోంది. కిచెన్‌లో ఉండటం, వంట చేయడం, ఇతర కంటెస్టెంట్ల మీద ఏదో ఒక కామెంట్ వేయడం, యావర్‌ను టార్గెట్ చేయడం తప్పితే దామిని పొడిచిందేమీ లేదని జనాలు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది.


ఈ మూడో వారంలో ఆమె ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. శుభ శ్రీ సైతం డేంజర్ జోన్‌లోనే ఉందని టాక్. కానీ దామినికి ఈ వారం ఫుల్ నెగెటివ్ కావడం, యావర్‌ను టార్గెట్ చేయడం వల్ల ఆమె గ్రాఫ్ మరింతగా తగ్గినట్టు అనిపిస్తోంది. ఇప్పటి వరకు వస్తోన్న సమాచారం వరకు అయితే దామిని ఎలిమినేట్ అయింది. కానీ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ ఈ సారి ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.


కావాలనే లీకులు బయటకు ఒకలా ఇస్తున్నారు. లోపల ఇంకోలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సారి లీకులు సైతం చాలా లేటుగానే వస్తున్నాయి. అలా వచ్చిన లీక్‌లను బట్టే దామిని ఎలిమినేట్ అయిందని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. ఇక అనధికారక ఓట్లలోనూ దామిని, శుభశ్రీలకు తక్కువ ఓట్లే వచ్చాయి. అందుకే అందరూ ఈ ఇద్దరి కంటెస్టెంట్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ఫిక్స్ అయ్యారు. ఇక 99 శాతం దామిని ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయిందనే లీకులు మాత్రం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఏం జరుగుతందనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. అయితే, ఈ వారం పవర్ అస్త్రను శోెభా రెండు రౌండ్లలో ఎక్కువ సేపు బుల్‌పై ఉండి.. 12 సెకన్ల తేడాతో ప్రియాంకపై గెలిచింది.


Also Read: Nindu Noorella Savasam September 23rd: ఇంట్లోకి తిరిగి అడుగుపెట్టిన అరుంధతి ఆత్మ - సైకోలా మారిన మనోహరి!


Join Us On Telegram: https://t.me/abpdesamofficial