Bigg Boss 6 Telugu: బిగ్‌‌బాస్ పంతొమ్మిదవ రోజుకు, 20వ ఎపిసోడ్‌కు చేరుకుంది. మూడో కెప్టెన్‌గా నెల్లూరువాసి, కామన్ మ్యాన్ ఆదిరెడ్డి నిలిచాడు. కెప్టెన్ అవ్వగానే తన భార్య కవితకు ఐలవ్యూ చెప్పాడు. ‘నువ్వు హ్యాపీనా’ అని అడిగాడు. బిగ్‌బాస్‌కి రావడమే గొప్ప అంటే ఇక కెప్టెన్ అయిపోయా అంటూ ఆనందపడిపోయాడు. ఇక ఎపిసోడ్ లో ఏమైందంటే...


కెప్టెన్సీ పోటీలో రెండో రౌండ్ లో శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి పోటీ పడ్డారు. ఇసుకను ఎత్తివేయడం అనే టాస్క్ ఇచ్చారు. అందులో పొడవుగా ఉండే ఆదిరెడ్డి ఈజీగా గెలిచేశాడు. శ్రీ సత్య ఇసుకను మోయలేకపోయింది. శ్రీహాన్ ఆదిరెడ్డికి గట్టిగానే  పోటీ ఇచ్చాడు కానీ ఓడిపోయాడు. ఆదిరెడ్డి ఫినోలెక్స్ సింహాసనంలో కూర్చుని కెప్టెన్ గా పనిచేయడం మొదలుపెట్టాడు.


ఎవరు ఎన్ని నిమిషాలు...?
ఇంట్లో ఎవరు  ఎన్ని నిమిషాల ఫుటేజ్ ఇస్తున్నారో తేల్చుకుని చెప్పాలని, ఆ నిమిషాలు రాసి ఉన్న ట్యాగ్స్ ని మెడలో వేసుకోమని చెప్పారు. ఓటింగ్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు ఇంటి సభ్యులు. అధికంగా పదినిమిషాలు కంటెంట్ ఇస్తున్నట్టు గీతూని సెలెక్ట్ చేశారు. పదినిమిషాల ట్యాగ్ ను ఆమె మెడలో వేశారు. తరువాత 7 నిమిషాల కంటెంట్ ఇస్తున్నట్టు ఫైమా - రేవంత్ పోటీ పడ్డారు. చివరికి ఆ ట్యాగ్ రేవంత్‌కే వచ్చింది. ఇనయ, శ్రీహాన్, వాసంతి, ఫైమా, చంటి ఇలా అందరూ ఎంతో కొంత సమయం ఉన్న ట్యాగ్ ను దక్కించుకున్నారు. కానీ అర్జున్ కళ్యాన్, ఆరోహి, కీర్తి జీరో ట్యాగ్‌ను దక్కించుకున్నారు. దీంతో వారిలో ఒకరు జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వారిలో అర్జున్ జైలుకెళ్లాడు. కీర్తి తనకు జీరో ట్యాగ్ వచ్చినందుకు చాలా ఏడ్చింది. 


 ఇనయను కావాలనే...
గీతూ - ఆదిరెడ్డి కలిసి రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంట్లోని సభ్యుల ఆటతీరు గురించి మాట్లాడసాగారు. గీతూ తాను కావాలనే ఇనయాకు కోపం తెప్పిస్తానని, ఆమె నెగిటివ్ ను బయటకు తీయడం కోసమే అలా చేశానని చెప్పింది. 


వాసంతి బాధ
ఇక ఇంట్లో గ్లామర్ డాల్ వాసంతి ఈ వారం తానే బయటికి వెళ్తానని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అందరితోనూ మాట్లాడుతూ తెగ బాధపడుతోంది. ఇనయతో నువ్వు,నేను,ఆరోహి డేంజర్ జోన్లో ఉంటాం అంది. తరువాత అర్జున్ తో అందరూ గీతూకి సపోర్ట్ చేస్తున్నారు కేవలం ఫుటేజ్ కోసమే అని చెప్పింది. ఫుటేజ్ కోసం గొడవలు పెట్టుకోవడం చాలా సిల్లీగా ఉంటుంది అని అంది. అలాగే రాత్రి పడుకుని ఇనయతో మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్లో ఒక్క వారం ఉన్నా లక్ అనే చెప్పాలి. లాస్ట్ వరకు ఉన్నామా, మధ్యలో వచ్చామా అన్నది కాదు. నాకు ఇక్కడ ఎవరూ నచ్చలేదు. నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్లు కూడా లేరు’ అంటూ బాధపడింది. 


సూర్య - ఆరోహి
వీళ్లిద్దరి మధ్య ఏముందో వారిద్దరికే తెలియాలి. కాసేపు స్నేహితుల్లా కనిపిస్తారు, కాసేపు ప్రేమికుల్లా ప్రవర్తిస్తారు. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ముచ్చట్లు, ఏడుపులు, బుజ్జగింపులు,సరసాలు మొదలుపెట్టారు. అర్థరాత్రి సూర్య ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాడు. అర్జున్, ఆరోహి, సూర్య కలిసి తిన్నారు. 


Also read: కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ నలుగురు? ఇనయాను లాగిపడేసిన దొంగలు, నేహాను కొట్టిన ఇనయ


Also read: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు, మధ్యలో శ్రీహాన్ - ఇనయా పిట్టగోల, నేనే ఆ ‘పిట్టని’ అంటూ మధ్యల వచ్చిన గీతూ