బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం హౌస్ మేట్స్ అందరూ గోల్డ్ మైనర్స్ గా మారాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. వీలైనంత ఎక్కువ గోల్డ్ ను సేకరించాలి. ఫైనల్ గా ఎవరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటుందో వాళ్లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడతారని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ పోటీ పడుతూ టాస్క్ ఆడారు. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన రెండు ప్రోమోలను విడుదల చేశారు. 


Also Read: 'సొంతింటి కోసం దాచుకున్న డబ్బు.. పునీత్ కల కోసం వాడతా..'


మొదటి ప్రోమోలో హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉన్న మానస్‌-సన్నీ మధ్య విభేదాలు వచ్చినట్లు చూపించారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీరామచంద్రకి పవర్ రూమ్ యాక్సెస్ వచ్చినట్లు చూపించారు. వెంటనే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన శ్రీరామ్ కి పవర్ టూల్ ఆఫర్ చేశారు బిగ్ బాస్. ఆ టూల్ ను తనే తీసుకుంటానని చెప్పాడు శ్రీరామ్. కానీ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకొచ్చి ఇంటి సభ్యులతో బేరం పెట్టాడు. 


పవర్ గురించి చదివే ముందు హౌస్ మేట్స్ కి ఆఫర్ ఇస్తున్నానని చెప్పిన శ్రీరామ్.. పవర్ టూల్ కావాలంటే 50 గోల్డ్ తనకు ఇవ్వాలని అడిగాడు. హౌస్ మేట్స్ అందరూ ఆలోచించే సమయంలో రవి తనకు పవర్ కావాలని అడిగాడు. వెంటనే శ్రీరామ్ కి గోల్డ్ ఇచ్చి పవర్ టూల్ తీసుకున్నాడు రవి. ఆ పవర్ ఏంటా..? అని చదివిన రవి.. ఎందుకు తీసుకున్నానా.. అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు.