శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే ఒకటి రాగా.. అందులో షణ్ముఖ్-సిరిలకు నాగార్జున క్లాస్ పీకుతూ కనిపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో రవిని బాగా ఆటపట్టించారు నాగార్జున.
Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..
'బాగా ఆడినవారికి గోల్డ్ ఇవ్వాలి.. వరస్ట్ పెర్ఫార్మన్స్ కి కోల్ ఇవ్వాలి.. ఎందుకో చెప్పాలని' నాగార్జున హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు. ముందుగా రవి.. కోల్ ని సన్నీకి ఇచ్చాడు. 'స్విమ్మింగ్ టాస్క్ లో నువ్ సన్నీ మీద పగ తీర్చుకున్నావా..?' అని రవిని ప్రశ్నించారు నాగార్జున. 'లేదు సార్.. ఐ వజ్ వెరీ ఓపెన్ అండ్ క్లియర్' అని చెప్పాడు రవి. 'ఏ విధంగా ఓపెన్' అని అడిగారు నాగ్. దానికి రవి.. 'నేను సరిగ్గా సరిగ్గా సరిగ్గా అని చెప్తూనే ఉన్నాను. టీషర్ట్ సరిగ్గా వేసుకోవాలని' అని అనగా.. 'నువ్ ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా' అని అన్నారు నాగ్.
ఆ తరువాత సన్నీ.. రూల్ బుక్ లో పూర్తిగా అని ఉందని.. సరిగ్గా అని లేదని అనగా.. 'మరి మానస్ మొదటి నుంచి ఎలా కరెక్ట్ గా వేసుకున్నాడు..?' అని నాగ్ ప్రశ్నించారు. దానికి సన్నీ సైలెంట్ గా ఉండిపోయాడు. కాజల్ ని ఉద్దేశిస్తూ.. 'దొరికితే దొంగ' అని ఆటపట్టించారు. ఆ తరువాత శ్రీరామచంద్రతో మాట్లాడుతూ.. పవర్ టూల్ గేమ్ బాగా ఆడావని.. అది చదువుకున్న తరువాత రవి ఎక్స్ ప్రెషన్ ప్రైస్ లెస్ అని అన్నారు నాగార్జున. రవికి ఇంతకముందు రకరకాల పేర్లు పెట్టారని.. అవన్నీ తీసేసి 'బకరా' రవి అని పేరు పెట్టారు నాగార్జున.