Bigg Boss 5 Telugu: 'దీప్తిని మిస్ అవుతుంటే.. వెళ్లిపో..' షణ్ముఖ్ కి షాకిచ్చిన నాగ్.. 

షణ్ముఖ్ తో మాట్లాడుతూ.. 'అసలేం జరుగుతుందని' ప్రశ్నించారు నాగ్. దానికి షణ్ముఖ్.. 'మెంటల్ గా బాగా వీక్ అయిపోయా సార్' అని చెప్పాడు.

Continues below advertisement

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో నాగార్జున.. సిరి, షణ్ముఖ్ లను సెపరేట్ గా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడారు. ముందుగా సిరికి క్లాస్ పీకారు. 'నిన్ను నువ్ హర్ట్ చేసుకుంటున్నావా..? ఇలాంటి పరిస్థితి హౌస్ లో అవసరమా..? ఎందుకు చేశావ్..? ఏం జరుగుతుంది..?' అంటూ నాగార్జున సిరిని ప్రశ్నించారు. 

Continues below advertisement

Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..

దానికి ఆమె 'ఏమో సార్ నాక్కూడా క్లారిటీ లేదు' అని చెప్పగా.. 'కోట్ల మంది నిన్ను చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అయ్యో ఇలా ఉండకూడదని అనుకోకూడదు కదా..' అని నాగ్ అనగా.. 'నా స్టోరీ నాకు తెలుసు.. బయట నేనేంటి అనేది నాకు తెలుసు. అయినా ఎందుకో కనెక్షన్ వస్తుంది.. నాకు తెలియట్లేదు' అని చెప్పింది.

ఆ తరువాత షణ్ముఖ్ తో మాట్లాడుతూ.. 'అసలేం జరుగుతుందని' ప్రశ్నించారు నాగ్. దానికి షణ్ముఖ్.. 'మెంటల్ గా బాగా వీక్ అయిపోయా సార్' అని చెప్పాడు. వెంటనే నాగ్.. 'అంత మిస్ అవుతున్నావా దీప్తిని..?' అని అడిగారు. చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయమని చెప్పిన నాగ్.. 'నీ కోసం గేట్స్ ఓపెన్ అయ్యాయి.. దీప్తిని మిస్ అవుతుంటే ఈ క్షణమే వెళ్లిపో' అని షాకిచ్చారు నాగ్. 

Continues below advertisement