బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారం పూర్తి చేసుకోబోతుంది. ఎలిమినేషన్ ప్రక్రియతో వీకెండ్ ఎపిసోడ్స్ చాలా ఇంటరెస్టింగ్ గా మారాయి. ఎలిమినేషన్ ఉన్న ఎనిమిది మందిలో నలుగురు సేఫ్ జోన్ లోకి రాగా.. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌస్ ని విడిచిపెట్టి వెళ్లబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి. ఇందులో హౌస్ మేట్స్ అందరూ కలిసి నాగార్జునకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడతా' విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి అందులోని పాటలకు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?
ఆ తరువాత 'విశ్వని అన్నయ్య అంటే అన్నావు కానీ.. సన్నీని మాత్రం అన్నయ్య అనొద్దు' అంటూ ప్రియాంకతో సరదాగా అన్నారు నాగార్జున. విశ్వ-ప్రియాంక డాన్స్ చేయగా.. 'మీ ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నంతసేపు నేను మానస్ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాను' నాగ్ కామెంట్ చేయగా.. మానస్ నవ్వేశాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. యానీ మాస్టర్ ఫన్ చేస్తూ కనిపించారు. ప్రియాకి హోలా లూప్ ఇచ్చి కామెడీ చేయించారు నాగార్జున. ఆ తరువాత హౌస్ లో లేడీస్ అందరూ కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించారు.
ఆ తరువాత హౌస్ మేట్స్ తో 'దాక్కో దాక్కో మేక' అనే ఆట ఆడించారు నాగార్జున. ఈ క్రమంలో ఒక హౌస్ మేట్ పరుగెడుతోన్న మరో హౌస్ మేట్ ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇందులో కూడా బిగ్ బాస్ హమీద-శ్రీరామ్, రవి-నటరాజ్ మాస్టర్, మానస్-ప్రియాంక ఇలా హౌస్ లో పాపులర్ జంటలను తీసుకున్నట్లు ఉన్నారు. అనంతరం నామినేషన్స్ లో ఉన్న వారిని లేచి నుంచోమని చెప్పారు నాగార్జున. యానీ మాస్టర్, సిరి, లోబో, నటరాజ్ మాస్టర్ లలో ఈరోజు ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.