బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటివరకు ఆరు వారాలను పూర్తి చేసుకుంది. ఈరోజుతో ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ కాగా.. నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, కాజల్ సేవ్ అయినట్లుగా ప్రకటించారు. మిగిలిన ఆరుగురిలో ఈరోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై క్లారిటీ రానుంది.
Also Read: సూపర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..
ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో రాగా.. అందులో హౌస్ మేట్స్ తో ఓ టాస్క్ ఆడించి, ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు నాగార్జున. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగార్జున హౌస్ మేట్స్ కి షాకిచ్చారు. నామినేషన్ లో ఉన్న యానీ, ప్రియాను హౌస్ మేట్స్ కి గుడ్ బై చెప్పామన్నారు నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వాళ్లిద్దరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున.. అక్కడే ఉన్న రెండు కప్ బోర్డ్స్ లోకి వెళ్లమని చెప్పారు.
వారిద్దరూ బాక్సుల్లోకి వెళ్లగానే లైట్స్ ఆన్ అయ్యాయి. లైట్స్ ఆగిపోయిన వెంటనే హౌస్ మేట్స్ ని వెళ్లి ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెక్ చేయమని చెప్పారు నాగార్జున. వెంటనే హౌస్ మేట్స్ పరుగెత్తుకొని వెళ్లి చూడగా.. రెండు బాక్సులు ఖాళీగా ఉన్నాయి. అది చూసిన నాగార్జున ఇద్దరూ స్టేజ్ పై వస్తారేమో అని కామెంట్ చేశారు. దీంతో 'ఇద్దరునా..?' అంటూ షాకయ్యారు హౌస్ మేట్స్.