ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఉండగా.. హౌస్ మేట్స్ మధ్య గొడవలు జరిగినట్లు ఉన్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ''నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయనే స్టేట్మెంట్ నేను తీసుకోలేను'' అంటూ షణ్ముఖ్ కి చెప్పింది కాజల్. దానికి యానీ మాస్టర్, సిరి వెటకారంగా నవ్వారు. ''ఈ హౌస్ లో జరిగిన ఏ గొడవైనా తీస్కో.. నేను స్టార్ట్ చేసింది కాదు'' అని షణ్ముఖ్ కి కాజల్ చెప్పగా.. మళ్లీ యానీ మాస్టర్ నవ్వింది. ఆ తరువాత సిరి.. కాజల్ ని ఉద్దేశిస్తూ.. ''ఒకవేళ నన్ను నామినేట్ చేయాలనుకుంటే స్ట్రాంగ్ రీజన్ తో రా తీసుకుంటాను. అలా సిల్లీ రీజన్స్ తో మాత్రం నన్ను నామినేట్ చేయకు'' అని చెప్పింది.
సిల్లీ రీజన్ కాదు.. వన్ ఆఫ్ ది పాయింట్ అని కాజల్ చెప్పగా.. అయితే నీ దగ్గరే పెట్టుకో అని చెప్పింది సిరి. ''సడెన్ గా వైబ్స్ మారిపోతాయ్.. ఎందుకు మారిపోతాయో అర్ధం కాదు.. క్లారిఫికేషన్ అడిగితే మాట్లాడరు'' అని కాజల్ అనగా.. వెంటనే సిరి.. ''నాకు నీ మీద ఎఫెక్షన్ లేదు.. ఇష్టం లేదు.. అందుకే నేను నీతో మాట్లాడట్లేదు'' అని చెప్పింది.
''నీతో నాకు నెగెటివ్ వైబ్ వచ్చింది'' అని యానీ మాస్టర్.. కాజల్ తో చెప్పగా.. ''నాకు ఎప్పుడూ తెలియలేదు నా మీద మీకు నెగెటివ్ వైబ్ ఉంది. నాకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చి చెప్పినప్పుడే తెలిసింది. నేను అంతర్యామిని కాదు అన్నీ తెలియడానికి'' అంటూ కాజల్ ఫైర్ అయింది. దానికి కూడా యానీ మాస్టర్ ఇమిటేట్ చేసింది. ''ఎక్కిరించడం రెస్పెక్ట్.. మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో.. నేను ఫీల్ అవుతున్నాను. అది నా ఒక్కదానికే అర్ధమవుతుంది'' అంటూ కాజల్ అరిచి చెప్పింది.