ఆదివారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఈరోజు ఎలిమినేషన్ ఉండడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. సండే ఫన్ డే అనుకుంటున్నారా..? సండే పనిష్మెంట్స్ అయిపోతాయ్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కొంచెం హీటెక్కాలి కదా అంటూ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. వాళ్లకు కొన్ని ప‌దాలు ఇచ్చి అవి ఎవ‌రికి సెట్ అవుతాయో చెప్పాల‌ని చెప్పారు. 


Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్


కాజల్ కి కన్నింగ్ ఇచ్చిన శ్రీరామ్.. గేమ్ లో ఆమె కన్నింగ్ ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత కాజల్.. సిరిని ఉద్దేశిస్తూ.. 'తనకు టు ఫేసెస్ ఉన్నాయ్ సార్.. నార్మల్ గా ఉండేప్పుడు ఒక ఫేస్.. గేమ్ ఆడేప్పుడు ఒక ఫేస్. ఇంకొక థర్డ్ ఫేస్ కూడా ఉందంట.. అది బయటకు వెళ్లాక చూపిస్తాదంట' అని చెప్పుకొచ్చింది. వెంటనే నాగ్.. 'షణ్ముఖ్ నువ్వేమైనా చూశావా..? థర్డ్ ఫేస్' అని అడిగారు. దానికి షణ్ముఖ్.. 'నేను రెండు ఫేస్ లే చూశాను సార్' అని కామెంట్ చేశాడు. 


రవికి ఫేక్ కార్డ్ మెడలో వేసిన సన్నీ.. 'కరెక్ట్ గా ఒక టైం వచ్చినప్పుడు ఫ్లిప్ అవుతుంటాడు. అది రవి స్ట్రాటజీ.. నాకనిపించింది' అని చెప్పాడు. ఆ తరువాత రవి.. 'సార్ ఆరోగంట్ అంటే చెప్పిన తరువాత కూడా వినకపోవడం కదా.. నాకు నచ్చింది చేస్తా.. ఎవడు చెప్పినా నేను వినను' అంటూ సన్నీ యాటిట్యూడ్ గురించి మాట్లాడాడు. ఫైనల్ గా నాగ్.. ఇంకా నామినేషన్ లో ఇద్దరు ఉన్నారని కాజల్, మానస్ లను గార్డెన్ ఏరియాలోకి పిలిచారు. వారిద్దరికీ ఓ టాస్క్ ఇచ్చారు. మరి వీరిద్దరిలో ఎవరు సేవ్ అవుతారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే!









ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి