నామినేషన్స్ హడావుడి, కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఈ రోజు ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 'బీబీ ఎక్స్ప్రెస్' టాస్క్ లో భాగంగా బజర్ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులు తీయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను హౌస్ మేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోలో కాజల్, శ్రీరామచంద్రల ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చారు. ముందుగా కాజల్ కూతురు 'మమ్మా' అంటూ అరుచుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్లింది. టాస్క్ లో ఫ్రీజ్ అయి ఉన్న తన తల్లిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ రిలీజ్ అని చెప్పడంతో కాజల్ వెంటనే తన కూతుర్ని హగ్ చేసుకుంది. కాజల్ భర్త కూడా భార్యాబిడ్డను హత్తుకున్నారు. ఈ ఎమోషనల్ సీన్ చూసిన సిరి కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ తరువాత కాజల్ భర్త హౌస్ మేట్స్ తో కూర్చొని కాజల్ పై సెటైర్లు వేశారు. ఆ తరువాత కాజల్ కూతురికి హౌస్ మేట్స్ ఫన్నీగా శ్రీరామ్ పై కంప్లైంట్ చేశారు. వెంటనే శ్రీరామ్ 'కోపం వస్తాదా..? మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే..?' అని ప్రశ్నించగా.. ఫన్నీగా 'ఊ' కొడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయింది కాజల్ కూతురు. కాసేపటికి శ్రీరామ్ సిస్టర్ హౌస్ లోకి వచ్చింది. రాగానే శ్రీరామ్ ని హత్తుకుంది. ఆ తరువాత షణ్ముఖ్ కెమెరా ముందుకు వెళ్లి 'సార్ బిగ్ బాస్ సార్.. మీరు ఎవరిని పంపిస్తున్నారో చెప్తే.. నా బుర్ర' అంటూ ప్లీజ్ చేసుకున్నాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి