Bigg Boss 5 Telugu: ట్రోఫీ మరిచిపో.. అతడికి హింట్ ఇచ్చి కవర్ చేసిన హరితేజ.. 

ఈరోజు ఎపిసోడ్ కి గత సీజన్లలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న కొందరు ఎక్స్ హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పంపించారు బిగ్ బాస్.   

Continues below advertisement

బిగ్ బాస్ సీజన్ 5 రేపటి ఎపిసోడ్ తో పూర్తి కానుంది. ప్రస్తుతం హౌస్ లో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రం విజేత కానున్నారు. ఈ వారం మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీలతో, ఫన్నీ గేమ్ తో ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్.. ఈరోజు ఎపిసోడ్ కి గత సీజన్లలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న కొందరు ఎక్స్ హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పంపించారు. 

Continues below advertisement

ఫస్ట్ సీజన్ నుంచి శివబాలాజీ, హరితేజ.. సెకండ్ సీజన్ నుంచి గీతామాధురి, రోల్ రైడా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కనిపించారు. ముందుగా రోల్ రైడా.. 'బయట ఎక్కడన్నా ఏదైనా ఎగురుతుంటే అది ట్రాక్టర్ ట్రాక్టర్ అని అంటున్నారు' అంటూ సిరిని ఆటపట్టించాడు. ఆ తరువాత హరితేజ.. ప్రియాంకను ఇమిటేట్ చేస్తూ మానస్ ని ఏడిపించింది. షణ్ముఖ్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాడని అతడిపై సెటైర్ వేసింది హరితేజ. 

ఆ తరువాత శివబాలాజీ.. షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ.. 'ఎక్కువ ఆలోచించొద్దు.. అన్నీ మర్చిపో..' అని అన్నాడు. దానికి హరితేజ 'ట్రోఫీ కూడా మర్చిపో అని చెప్పి ఆయన తీసుకెళ్లిపోయాడు. లాస్ట్ కి ఎలా అయిపోయిందంటే శివబాలాజీ గెలిచాడంటూ చప్పట్లు కొడుతున్నాను' అంటూ పంచ్ వేసింది. 

టాప్ 5 కంటెస్టెంట్స్ తో హరితేజ సాంగ్ గెస్ చేసే గేమ్ ఆడింది. దీని హౌస్ మేట్స్ డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఎప్పటిలానే షణ్ముఖ్-సిరి జంటగా డాన్స్ చేస్తుండగా.. మిగిలిన ముగ్గురు తమ డాన్స్ లు వేసుకుంటూ కనిపించారు. అది చూసిన హరితేజ.. 'వాళ్ల ముగ్గురి పరిస్థితి చూడు' అంటూ ఫన్నీగా డైలాగ్ వేసింది. ఆ తరువాత శ్రీరామ్ 'నిన్న బిగ్ బాస్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ అని సిరిని పంపించేస్తే చాలా సంతోషపడ్డాం. కానీ ఇంతలోనే కన్ఫెషన్ రూమ్ నుంచి షన్ను అని అరుచుకుంటూ బయటకొచ్చింది' అంటూ సిరిని ఇమిటేట్ చేస్తూ చెప్పాడు. 

Also Read: రవితేజతో గొడవలు.. బాలయ్య క్లారిటీ ఇస్తాడా..?

Also Read:అప్పుడు హోస్ట్ గా.. ఇప్పుడు గెస్ట్ గా.. బిగ్ బాస్ స్టేజ్ పై నాని..

Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...

Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?

Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement