జెస్సీ కావాలనే తమకు దూరంగా ఉంటున్నాడని షణ్ముఖ్, సిరి చర్చించుకున్నారు. జెస్సీ విషయంలో అంత జాలీ అవసరం లేదని.. తను ప్లేయర్ అని మానస్.. సన్నీకి చెప్పాడు. 'పింకీ వెళ్లిపోతే మానస్ పరిస్థితి ఏంటి..?' అంటూ షణ్ముఖ్, రవితో డిస్కషన్ పెట్టాడు. సన్నీ ఉన్నాడుగా అంటూ రవి అన్నాడు. 


Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..


నామినేషన్ ప్రక్రియ.. 


కెప్టెన్ యానీ మాస్టర్ ని నామినేషన్ కోసం నలుగురు సభ్యులను ఎన్నుకొని నేరుగా జైల్లోకి పంపించమని చెప్పారు బిగ్ బాస్. రవి, షణ్ముఖ్ లను నామినేట్ చేయనని ముందే చెప్పేసింది యానీ. ముందుగా కాజల్, సన్నీ, మానస్ లను జైల్లో పెట్టిన యానీ.. ఫైనల్ గా ఆప్షన్ గా లేక షణ్ముఖ్ ని కూడా జైలుకి పంపించింది. జైల్లో ఉన్న సన్నీ 'అపనా టైం ఆయేగా' అంటూ పాట పాడగా.. దానికి యానీ 'అందరికి టైం వస్తాదని' రియాక్ట్ అయింది. యానీ మాస్టర్ ఫేవరిజం చూపించిందని మానస్ తన అభిప్రాయాన్ని సన్నీతో పంచుకున్నాడు. 


నామినేషన్ లో భాగంగా..  బయట మిగిలిన సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బజర్ మోగిన వెంటనే ఎవరు ముందుగా వెళ్లి తాళం తీసుకుంటారో వాళ్లు జైలు ఓపెన్ చేసి ఒకర్ని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వారు ఎవర్ని నామినేట్ చేస్తారో వారు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్ గా జైల్లో ఎవరు మిగులుతారో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అవుతారు. 


ముందుగా షణ్ముఖ్.. సిరి, రవిలతో మాట్లాడాడు. తాళం దొరికితే ముందు తనను బయటకు తీసుకురావొద్దని స్ట్రాటజీ చెప్పాడు. వాళ్లు కావాలనే ఛాన్స్ పింకీకి ఇచ్చారు. పింకీకి తాళం దొరకడంతో ఆమె మానస్ ని బయటకు తీసుకొచ్చింది. బయటకొచ్చిన మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేశాడు. ఫైనల్ కాల్ ప్రియాంక తీసుకోవాలి కాబట్టి ఆమె ఇద్దరిలో జెస్సీని జైలుకి పంపించింది. 


రెండోసారి బజర్ మోగినప్పుడు సిరికి తాళం దొరికింది. ఆమె జెస్సీని బయటకు తీసుకొచ్చింది. బయటకొచ్చిన జెస్సీ.. పింకీ, మానస్ లను నామినేట్ చేశాడు. వాళ్ల రీజన్స్ నచ్చలేదని చెప్పాడు. ఫైనల్ కాల్ సిరి తీసుకోవాలి కాబట్టి ఆమె మానస్ ని జైలుకి పంపించింది. 


మూడోసారి బజర్ మోగినప్పుడు రవి-శ్రీరామ్-జెస్సీ లు మాట్లాడుకొని డిసైడ్ అయ్యి జెస్సీ తాళం తీసుకున్నాడు. తను షణ్ముఖ్ ని బయటకు తీసుకొచ్చాడు. అలా బయటకొచ్చిన షణ్ముఖ్.. ప్రియాంకని నామినేట్ చేశాడు. ఎందుకని ప్రియాంక ప్రశ్నించడంతో  తన కెప్టెన్సీలో ప్రాబ్లెమ్ ఫేస్ చేసింది పింకీతో అని చెప్పాడు. అందుకు తాను పనిష్మెంట్ తీసుకున్నా అని చెప్పింది. రెండో నామినేషన్ సిరికి వేయగా.. జెస్సీ ఫైనల్ కాల్ తీసుకొని ప్రియాంకను నామినేట్ చేశాడు. ప్రోపర్ రీజన్ ఇచ్చి నామినేట్ చేయమని ఫైర్ అయింది. దానికి షణ్ముఖ్.. నేను ఇలానే చేస్తానని అన్నాడు. 


నాల్గోసారి బజర్ మోగినప్పుడు మళ్లీ రవి-షణ్ముఖ్-శ్రీరామ్ అందరూ మాట్లాడుకొని రవి తాళం తీసుకున్నాడు. రవి.. ప్రియాంకను బయటకు తీసుకొచ్చాడు. బయటకొచ్చిన ఆమె షణ్ముఖ్-జెస్సీలను నామినేట్ చేసింది. రవి ఫైనల్ కాల్ తీసుకొని షణ్ముఖ్ ని జైలుకి పంపించాడు. 
ఐదోసారి బజర్ మోగినప్పుడు శ్రీరామ్ తాళం తీసుకొని.. జైల్లో ఉన్న నలుగురిలో ఒక్కరినే బయటకు తీసుకురాగలనని.. ఎవరిని తీసుకురావాలో మీరే చెప్పమని జైల్లో ఉన్నవారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు శ్రీరామ్. ఫైనల్ గా కాజల్ ని బయటకు తీసుకొచ్చాడు. అలా బయటకొచ్చిన ఆమె రవి, సిరిలను నామినేట్ చేసింది. ఫైనల్ కాల్ శ్రీరామ్ తీసుకోవాలి కాబట్టి అతడు సిరిని జైలుకి పంపించాడు. 


ఆ తరువాత కాజల్.. జైల్లో ఉన్న సన్నీ, మానస్ లతో డిస్కషన్ పెట్టింది. శ్రీరామ్ తనతో డీల్ పెట్టుకున్నాడని.. సిరిని జైలు నుంచి బయటకు తీసుకురావాలని చెప్పింది కాజల్. దానికి మానస్-సన్నీ ఒప్పుకోలేదు. 'ఇది కార్నర్ గేమ్' అంటూ మానస్ డైలాగ్ వేశాడు. చివరకు సన్నీ.. 'నీ కాల్ నీ ఇష్టం' అని చెప్పేశాడు. 


ఆరోసారి బజర్ మోగినప్పుడు కాజల్ తాళం తీసుకొని జైల్లో ఉన్న షణ్ముఖ్ ని బయటకు తీసుకొచ్చింది. బయటకొచ్చిన షణ్ముఖ్.. రవి, శ్రీరామ్ లను నామినేట్ చేయగా.. ఫైనల్ కాల్ కాజల్ తీసుకోవాలి కాబట్టి ఆమె రవిని సెలెక్ట్ చేసింది. 


జైల్లో ఉన్న నలుగురు నేరుగా నామినేషన్ లోకి వెళ్లారు. అలానే కెప్టెన్ యానీ మాస్టర్ ని మిగిలిన ఇంటి సభ్యుల నుంచి మరొక పెర్సన్ ను నేరుగా నామినేట్ చేయమని చెప్పారు బిగ్ బాస్. ఆమె కాజల్ ని నామినేట్ చేసింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్. 


Also Read: రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. హిందీ రిలీజ్ పక్కా..


Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి