బిగ్ బాస్ సీజన్ 5 ఆరోవారం నడుస్తోంది. ఈ వారం హౌస్ నుంచి నామినేట్ అవ్వడానికి మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. మరి వారిలో ఎవరి ఎలిమినేట్ కాబోతున్నారో ఆదివారం నాటి ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి బొమ్మల టాస్క్ ఒకటి ఇచ్చారు. ఇందులో హౌస్ మేట్స్ అందరూ రెచ్చిపోయి ఆడేశారు. కానీ రూల్స్ ని పాటించకుండా ఆడినందుకు రవి టీమ్ ను కెప్టెన్సీ టాస్క్ పోటీ నుంచి తప్పించారు బిగ్ బాస్. సంచాలకులుగా వ్యవహరించిన కాజల్, సిరిలను కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించారు. 

 


 

అనంతరం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డ హౌస్ మేట్స్ లో విశ్వ విన్నర్ గా నిలిచారు. ప్రియాంక రేషన్ మ్యానేజర్ గా ఎన్నికైంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో.. చెప్పమని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని అడిగారు. ముందుగా విశ్వ.. రూల్స్ కు వ్యతిరేకంగా ఆడినందుకు రవికి వరస్ట్ పెర్ఫార్మర్ ముద్ర వేశాడు. దానికి రవి.. దాని వలన మీకేమైనా ఎఫెక్ట్ అయిందా అంటూ పరోక్షంగా మండిపడ్డాడు. 

 

ఆ తరువాత కాజల్.. 'నాకు నీ కారణంగా బిగ్ బాస్ నుంచి ఈ మార్క్ వచ్చినందుకు.. నీకు ఈ మార్క్ ఇవ్వాలనుకుంటున్నా' అంటూ వరస్ట్ పెర్ఫార్మర్ స్టాంప్ ను రవికి వేసింది. ఈ వారం జశ్వంత్ కనిపించలేదు అంటూ రవి.. జెస్సీకి వరస్ట్ పెర్ఫార్మర్ స్టాంప్ వేశాడు. 'అది మీ ప్రాబ్లమ్.. నా ప్రాబ్లెమ్ కాదు' అంటూ జెస్సీ చెప్పాడు. ఆ తరువాత యానీ మాస్టర్.. 'నేనే సంచాలక్.. ఎవరి మాట వినలేను.. నాకేం అనిపిస్తే అదే చేస్తా' అంటూ సిరి బిహేవియర్ ను ఇమిటేట్ చేసింది. దానికి సిరి.. 'అస్సలు అలా అనలేదు' అనగా.. 'నువ్ అన్నావ్.. నేను తీసుకోలేకపోయాను' అంటూ యానీ మండిపడింది. ఆ తరువాత మానస్ కూడా సిరి బిహేవియర్ నచ్చలేదంటూ ఆమెని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నాడు. మరి వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎవరు జైలుకి వెళ్తారో చూడాలి!