Bigg Boss 10 Telugu Confirmed Contestant 2026: సెప్టెంబర్‌లో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. బిగ్ బాస్ ఇంటిలోకి సామాన్యులను పంపడం కోసం మొదలైన 'బిగ్ బాస్' అగ్నిపరీక్షను వరుస వివాదాలను వెంటాడుతున్నాయి. తనను రిజెక్ట్ చేయడం కంటే ట్రాన్స్ అని బిందు మాధవి అడగటం, మిమ్మల్ని పంపిస్తే సమాజానికి ఎటువంటి మెసేజ్ వెళుతుందని నవదీప్ అడగటంపై ఉప్పల్ బాలు రచ్చ రచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్ళే సామాన్యులు ఎవరనేది పక్కన పెడితే... విలన్ రోల్స్ చేస్తూ పాపులరైన టాలీవుడ్ ఆర్టిస్ట్ ఒకరిని ఫైనలైజ్ చేశారట. అతను ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

Continues below advertisement

'బిగ్ బాస్ 10'లోకి టెంపర్ వంశీTemper Vamsi Set To Enter Bigg Boss 10 Telugu: 'టెంపర్' వంశీ... మన తెలుగు వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'టెంపర్'లో ఓ అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తిగా వంశీ నటించారు. ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో వంశీ విలనిజానికి, ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.

Continues below advertisement

'టెంపర్' తర్వాత పలు సినిమాలు చేశారు వంశీ. 'అత్తారింటికి దారేది', 'భరత్ అనే నేను', 'సాహో', 'భీష్మ', 'వకీల్ సాబ్', 'హిట్ 2', 'దేవర' వంటి సినిమాలు చేశారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రీసెంట్ వరుణ్ తేజ్ సినిమా 'కొరియన్ కనకరాజు'లోనూ వంశీ నటించారు. 'టెంపర్'తో ఆయన గుర్తింపు వచ్చింది కనుక అందరూ ఆయన్ను 'టెంపర్' వంశీ అని పిలుస్తున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్ 10' ఇంటిలోకి వంశీ ఫైనల్ అయ్యారని టాక్. 

Also Read: Ravi Teja Irumudi Movie Review In Telugu - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

రీల్ లైఫ్ విలన్... రియల్‌గా ఎలా ఉంటారో!?'బిగ్ బాస్ 10'లోకి కంటెస్టెంట్‌గా వంశీ వెళితే... స్టార్ మా తీసుకున్న బెస్ట్ ఛాయిస్‌ అని చెప్పవచ్చు. రీల్ లైఫ్ విలన్ రోల్స్ చేసిన వ్యక్తి... రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? బిగ్ బాస్ ఇంటిలో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశమే. 'బిగ్ బాస్' 10 ఇంటిలోకి వెళ్ళడం లేదని, అది ఫేక్ న్యూస్ అని యంగ్ ఫిమేల్ యాంకర్ ఛర్మిల స్పష్టత ఇచ్చారు. మరి టెంపర్ వంశీ కాకుండా ఇంకెవరు ఆ ఇంటిలో అడుగు పెడతారో చూడాలి.

Also ReadBrahmanandam Brother Video - అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

'స్టార్ మా' టీవీలో సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 మొదలు కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్నారు. ఉప్పల్ బాలు రచ్చ, ఆ ఇష్యూపై కొందరు రియాక్ట్ కావడంతో కార్యక్రమానికి కావాల్సినంత ప్రచారం తీసుకొచ్చింది.

Also ReadJagamae Sangeetham OTT Release Date - ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్