Prakash Raj's Jagamae Sangeetham OTT Release Date Announced: ప్రకాష్ రాజ్ పాన్ ఇండియా యాక్టర్. ఆయన మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో నటిస్తున్నారు. అయితే... ఇటీవల ఆయన పేరు ఎక్కువగా రాజకీయ వార్తల్లో వినబడుతోంది. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఇప్పుడు ఓ ఓటీటీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ (Amazon Prime Video OTT).

Continues below advertisement

మెగా డాటర్ సుష్మిత నిర్మాణంలో...'కుమారి 21ఎఫ్' సూర్యప్రతాప్ దర్శకుడిగా!Jagamae Sangeetham Streaming Date Telugu: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Susmita Konidala)కు చెందిన ప్రొడక్షన్ హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్‌లో 'జగమే సంగీతం' రూపొందింది. ఆ మధ్య (మార్చి 2026)లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు సిరీస్ టీజర్, ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రీమియర్ డేట్ ప్రకటించారు.

'జగమే సంగీతం' వెబ్ సిరీస్‌కు 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' సినిమాల ఫేమ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. సంగీతం, మనుషుల మధ్య అనుబంధాల నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 4వ తేదీన సిరీస్ విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.

Continues below advertisement

Also Read: RJ Charmila Nalluru On Bigg Boss 10 Telugu - 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్

ప్రకాష్ రాజ్ (Prakash Raj Latest Web Series)తో పాటు సీనియర్ నటి మధుబాల, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేకా, అక్షయ్ లగుసాని ఇతర కీలక పాత్రలు పోషించారు.

Also ReadBrahmanandam Brother Sri Vadan Viral Video - అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో ఇంతకు ముందు 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' సిరీస్ నిర్మించారు సుస్మితా కొణిదెల. అది జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ హిట్ తర్వాత మరోసారి వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దాంతో 'జగమే సంగీతం'పై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సిరీస్ ఎటువంటి స్పందన అందుకుంటుందో చూడాలి. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో 'ఫౌజీ' సినిమాకూ ఆయన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Also ReadNTR Pet Bagheera Passed Away - దుఃఖంలో ఎన్టీఆర్ కుటుంబం... వాళ్ళను విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన 'భగీర'