Srikanth's Mister Middle Class OTT Sudden Streaming : రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్ రెండు ఓటీటీల్లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఆహాతో (Aha) పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా... రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు. సునీల్, అలీ, రఘుబాబు, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, పృథ్వీరాజ్, బాబూ మోహన్, ధన్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్న మూవీ ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.
స్టోరీ ఏంటంటే?
వెంకటరమణ (శ్రీకాంత్)ది సగటు మధ్య తరగతి ఫ్యామిలీ. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటాడు. భార్య పద్మావతి (లయ), తండ్రి ఏడుకొండలు, చెల్లి, బావ, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో జీవిస్తూ ఉంటాడు. టిఫిన్ సెంటర్ పెట్టి బాగా డబ్బులు సంపాదించిన వెంకటరమణ... రెస్టారెంట్ పెట్టాలని ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి నష్టపోతాడు. దీంతో అదే రెస్టారెంట్ వేరే వారికి అమ్మేసి అందులోనే వర్కర్‌గా జాయిన్ అవుతాడు.
చాలీచాలని ఆదాయంతో తీవ్ర ఇబ్బందులు పడతాడు. దీంతో తనను చంపేయాలంటూ దేవున్ని వేడుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి (రాజేంద్ర ప్రసాద్) ప్రత్యక్షమై ఓ మహిమ గల పుస్తకం ఇస్తాడు. అందులో ఏది రాస్తే అది నిజం అవుతుంది. దీంతో అత్యాశకు పోతాడు. రాసిన ప్రతీ మాట నిజం అవుతుందని నమ్మి తీసుకునే నిర్ణయాలు క్రమంగా కొత్త సమస్యలకు దారితీస్తాయి. అసలు ఆ పుస్తకం మహిమ ఏంటి? అందులో ఉన్న నిబంధన ఏంటి? దేవుడు వెంకటరమణకే ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోరికలు నిజం చేసుకునే క్రమంలో వెంకటరమణ ఏం తప్పులు చేశాడు? ఆ బుక్ అతని కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితికి తెచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
