Bharani Eliminated From Telugu Bigg Boss Season 9:  తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ షాకింగ్ ఎలిమినేషన్ మర్చిపోకముందే మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం భరణిని ప్రేక్షకులు ఇంటి నుంచి పంపేశారన తెలుస్తోంది. వెళ్లిన మొదటి రోజు నుంచి బాండింగ్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ తానే తోపు అనుకునే సీరియల్ యాక్టర్ భరణికి ప్రేక్షకులు బైబై చెప్పేశారు. మీ బంధాలు బంధుత్వాలు సొంత ఇంట్లో చూసుకోండి అని చెప్పేశారు. కాపాడుతాడని భావించిన ఇమాన్యుయెల్ కూడా భరణిని కాపాడలేకపోయాడు. చివరకు ప్రేక్షకుల ఓట్లు ఎక్కువగా పడని భరణిని నాగార్జున ఇంటి నుంచి పంపేశారు. 

Continues below advertisement

హీరో నుంచి జీరో వరకు

బిగ్‌బాస్ సీజన్ 9లో గట్టి ఆటగాళ్లు ఎవరని అడిగితే ముందుగా భరణి పేరు వచ్చేది. ఆయనకి ఉన్న ఫిజిక్‌తో ాటలు ఆదరగొడతారని అంతా భావించారు. కానీ ఆయన ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత టాస్క్‌లలో ఫర్వాలేదు అనిపించినా మిగతా వ్యవహారాల్లో ఆయన తీరు సరిగా లేకుండా పోయింది. తనను పొగిడేవాళ్లతో ముందుకెళ్లి మిగతా వాళ్లను టార్గెట్ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ముఖ్యంగా దసరా టైంలో జరిగన టాస్క్‌లలో శ్రీజ, కల్యాణ్‌ను టార్గెట్ చేశారనే భావన అందరిలో వచ్చింది. అప్పటి వరకు న్యూట్రల్‌గా ఉంటారని అంతా అనుకున్నప్పటికీ ఆ వారం మాత్రం ఆయన అసలు రూపం వెలుగుచూసింది. 

ఇద్దరితోనే మంచి బాండింగ్

వచ్చిన మొదట్లో అందరితో చాలా బాగానే ఉండే వాళ్లు. కానీ దివ్య హౌస్‌లోకి వచ్చిన తర్వాత భరణి ఆట పూర్తిగా గాడి తప్పింది. ఆమె వచ్చీ రాగానే మొదటి స్థానం ఇవ్వడమే కాకుండా ఆయనతో కలిసి ఉండేందుకు ఎక్కువ ప్రయార్టీ ఇచ్చింది. దీంతో బయట తన పాపులారిటీ బాగా పెరిగిందని భావించి గేమ్‌ పూర్తిగా నాశనం చేసుకున్నారు. అప్పుడు దివ్య ఇంచిచన ర్యాంకింగ్స్‌ బట్టి చివరిలో ఉన్న కల్యాణ్, శ్రీజ, లాంటి వాళ్లను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. 

Continues below advertisement

బాండింగ్స్‌తో చికాకు

అప్పటికే తనూజతో ఉన్న కూతురు బాండింగ్‌ భరణి కంటిన్యూ చేశారు. ఆమెకు తోడు దివ్య కూడా జత కట్టింది. అన్న అంటూ ఆయనతోనే ఎక్కువ మాట్లాడింది. ఎక్కడ చూసిన దివ్య, భరణి మాత్రమే కనిపించేవాళ్లు. ఇది చూసిన తనూజ అలగడం, బాధపడటం ప్రేక్షకులు చూశారు. మరోవైపు ఇమాన్యుయెల్‌, రాము ఆయన్ని అన్నా అంటూ చుట్టూ తిరిగారు. దీనిపైనే సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేశాయి. ఈ ఫ్యామిలీ ట్రీ అందర్నీ చిరాకు పెట్టించింది. 

తానే తోపు అనే భావన 

దివ్య రాకతో తానే తోపుగా ఫిల్‌ అయిన భరణి వైల్డ్ కార్డు ఎంట్రీతో అయోమయంలో పడ్డారు. అంతా బాండింగ్స్‌పై నెగటివ్‌గా చెప్పడంతో వారితో ఉండలేక వారిని విడిచిపెట్టి విలన్‌గా మారలేక సతమతమయ్యాడు. అదే టైంలో తనకు ఫాలోయింగ్ బాగా ఉందని తను ఇప్పట్లో హౌస్‌ నుంచి బయటకు వెళ్లేది లేదు అన్నట్టు గేమ్ ప్లే చేశారు. ఆయన మాటల్లో కూడా ఇది బాగా కనిపించింది. తనను టార్గెట్ చేసిన వాళ్లే ఇంటి నుంచి గత కొన్ని వారాలుగా బయటకు వెళ్తున్నారని దివ్యతో చెప్పారు. తాను ఎవర్నీ టార్గెట్ చేయాల్సిన పని లేదని తనను ఏదైనా అంటే వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోతారనే భ్రమలో ఉంటూ వచ్చారు. ఆయనకు దివ్య కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. 

తన కోసం గేమ్ ఆడటం మానేసిన భరణి

గత వారంలో తనూజ, దివ్య, రాము, భరణి అందరూ నామినేషన్‌లో ఉండటంతో భరణికి గట్టిగానే దెబ్బపడింది. అంతే కాకుండా పదే పదే తానే వెళ్లిపోతానంటూ దివ్య ఏడుస్తూ చెప్పుకుంది. ఆమెను రక్షించడానికి మాధురితో సరిగా మాట్లాడాలని, ఇమాన్యుయెల్‌తో మాట్లాడాలని సలహాలు ఇచ్చాడు. తాను కూడా మాట్లాడతానని చెప్పాడు. అన్నింటిని ఆమె కొట్టపారేసింది. అవసరం లేదని చెప్పింది. ప్రేక్షకులు ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక్కడ తన గేమ్ ఆడటం మానేసి దివ్యను ఎలా రక్షించాలనే ప్రయత్నంలో ఉండిపోయాడు. 

మొదట్లో తనూజా కోసం ఇప్పుడు దివ్య కోసం గేమ్ ఆడుతున్న భరణి పట్ల ప్రేక్షకుల్లో అసహం మొదలైంది. అంతే కాకుండా తను గ్రూప్‌గా భావించే వారంతా నామినేషన్‌లో ఉండటంతో ఓట్లు విడిపోయాయి. అందుకే భరణి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. చివరి వరకు భరణి , రాము మిగిలారు. మిగతావారంతా సేవ్ అయ్యారు.