Telugu Bigg Boss House Season 9: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి వెళ్లిన వాళ్ల ట్రూ కలర్స్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వచ్చిన మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు వారు చేస్తున్న చేష్టలకు సంబంధమే ఉండటం లేదు. ముఖ్యంగా ముగ్గురు కంటెస్టెంట్స్ తీరు చిరాకు తెప్పిస్తోంది. వీళ్లు చెప్పింది ఏంటీ చేస్తున్నది ఏంటీ అనేలా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ప్రతి విషయంలో ఎక్కడ గొడవ పెట్టుకుందామా ఎవరిను బ్లేమ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది. కేవలం కంటెంట్ కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. వారందరిలో ఆయేష చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తున్న వారికి తలనొప్పి వస్తోంది.
ఆయేషకు ఇప్పటికే బిగ్ హౌస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తమిళనాడులో దాదాపు 70 రోజుల వరకు ఉండి వచ్చింది. ఆమె చాలా హైపర్ యాక్టివ్. బబ్లీగా అల్లరి చిల్లరిగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు జరుగుతున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ చూసి వచ్చింది. దీంతో ఆట అదరగొడుతుందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే వచ్చీ రాగానే తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంది. నాగార్జునతో స్టేజ్‌పై చేసిన హంగామా కూడా జనాలను ఆనందపరిచింది. అదే జోష్‌తో హౌస్‌లోకి వెళ్లి అల్లరి అల్లరి చేసింది.
హౌస్‌లోకి వచ్చిన తర్వాత తన జోష్ కొనసాగించింది.అందరితో చలాకీగా మాట్లాడుతూ వారిలో ఉన్న లోపాలను వివరిస్తూ తన గేమ్‌ను కంటిన్యూ చేసింది. ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్‌ను ఎవరికి బయట మంచి సపోర్ట్ ఉంది. ఎవరికి బయట సపోర్ట్ లేదూ అని తెలుసుకొనిన మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. తాను ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోకుండా ఎలాంటి ఎమోషన్స్‌కు లోను కాకుండా ఉంటానంటూ ఫోజులు కొట్టింది.
ఆ తర్వాత రోజు వచ్చిన నామినేషన్ ప్రక్రియలో తనూజను టార్గట్ చేసింది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ చూసి తనకు వర్కౌట్ అవుతుందని గ్రహించి ఆమె గేమ్‌లోని లోపాలు ఎత్తిచూపుతన్నట్టు ఆమెతో ఫైట్‌కి దిగింది. కేవలం బాండింగ్స్‌తో కాలక్షేపం చేస్తున్నావని, ఆట లేకపోయినా కేవలం ఎమోషన్స్‌తో ఆడుతున్నావని పేర్కొది. తనూజ కారణంగానే మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్పుకొచ్చింది. ప్రతి విషయంలో అరవడం, లేనిపోని విషయాలకు ఇతరులతో ఫైట్ చేయడం బాగోలేదని చెప్పింది.
తనూజతో మాత్రమే కాకుండా మిగతా వారితో కూడా ఇలాంటివి నూరిపోసింది. వారితో ఉండటం వల్ల మీ గేమ్ పాడవుతుందని వారికి తెలిపింది. ముఖ్యంగా పవన్, కల్యాణ్, భరణిని పదే పదే ఇలాంటి విషయాలతోనే మైండ్ గేమ్ ఆడింది. ఇంత చేస్తూ వచ్చిన ఆయేష తన గేమ్ వచ్చేసరికి అన్నింటిని మర్చిపోయింది. ఇతరులకు తప్పు అని చెప్పినవే ఆమె ఇప్పుడు చేస్తోంది. మొదటి రోజే తనకు బాల్ ఇవ్వాలని వారిని రిక్వస్ట్ చేసింది. తనకు బాల్ ఇవ్వలేదని ఏడ్చింది. ఎవరూ హెల్ప్ చేయడం లేదని కూడా బాధపడింది.
ఆ ఒక్కటే కాదు తర్వాత రోజు నుంచి ప్రతి చిన్న విషయంలో గొడవ పడుతుంది. గిన్నెలు కడగలేదని వాటిని పక్కకి కూడా జరపలేదని రీతుతో వివాదం పెట్టుకుంది. ఆమెను టార్గెట్ చేయడానికి పవన్‌కు దగ్గరవుతున్నట్ట నటిస్తోంది. రీతుతో తిరగొద్దని పదే పదే చెబుతూ వస్తోంది. కేవలం రీతును టార్గెట్ చేయడానికి గొడవను ఏ లెవల్‌కైనా తీసుకెళ్తోంది. చిన్న చిన్న విషయాలపై కూడా వివాదాలు పెట్టుకోవాలని చూస్తోంది. గట్టిగట్టిగా ఆరుస్తోంది.
ఈ వారం జరిగిన కెప్టెన్ టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత ఆయేష చేసిన చేష్టలు అందర్నీ మరింతగా చిరాకు పెట్టించాయి. దివ్వెల మాధురితో జత కట్టిన ఆమె గేమ్‌లో ఓడిపోయింది. తాళం తీయడంలో విఫలమైంది. తనకు సైట్ ఉందని అందుకే చీకటిలో ఏం కనిపించలేదని చెప్పుకొచ్చింది. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టి, గౌరవ్ విజయం సాధించారు. తర్వాత బయటకు వచ్చిన ఆయేష కింద కూర్చొని బోరున ఏడ్చింది. చెంపలపై కొట్టుకొని తన వల్లే గేమ్ ఓడిపోయామని బాధపడింది. బాధపడటం సరైనదే అయినా తనను తాను కొట్టుకోవడం తప్పు. అంతే కాకుండా ఇవే కారణాలతో వేరే వాళ్లను నిందించి నామినేషన్ వేసిన వ్యక్తి ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తర్వాత కాసేపటికే యాక్టివ్ అయ్యింది. తర్వతా ఏడ్వడం మొదలు పెట్టింది. ఇలా క్షణానికో రకంగా ప్రవరిస్తూ తను గతంలో చెప్పిన వాటికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది.
ఇలా విరుద్ధంగా బిహేవ్ చేస్తూ ఆయేష గేమ్‌ను పూర్తిగా నాశనం చేసుకుంటుంది. ఇది చూసే వాళ్లకు చికాకు పెడుతోంది. మొదట్లో క్యూట్‌గా కనిపించే చేష్టలు ఇప్పుడు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. మొదట్లో సంజనా చేసిన దొంగతనాలు నవ్వులు పూయించాయి. కానీ తర్వాత అవే చోరీలు ఆమె గేమ్‌ను పూర్తిగా నాశనం చేశాయి. ఇప్పుడు ఆయేషది అదే పరిస్థితి గతంలో బిగ్‌బాస్ వెళ్లొచ్చిన అనుభవం, ఇప్పుడు గేమ్ చూసి ఆడుతున్న వ్యక్తి ఇలా బిహేవ్ చేయడం సరికాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.