బిగ్ బాస్ ఓటీటీ మొదలై ఏడు వారాలు పూర్తవుతోంది. ఇప్పటివరకు ఈ షోపై సరైన బజ్ రావడం లేదు. 24 గంటలు అనే కాన్సెప్ట్ జనాలకు ఎక్కడం లేదు. ఈ షోలో ఎన్ని మార్పులు చేస్తున్నా.. వ్యూస్ మాత్రం రావడం లేదు. మొత్తానికి ఈ నాన్ స్టాప్ ప్రయోగం మాత్రం వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. మొదటి మూడు, నాలుగు వారాలైతే షోలో అసలు పస ఉండేదే కాదు. ఇప్పుడు కంటెస్టెంట్స్ తగ్గుతున్న కొద్దీ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటివరకు ముమైత్ ఖాన్, శ్రీరాపాక, సరయు, ఆర్జే చైతూ, తేజస్వి, స్రవంతి ఎలిమినేట్ అయ్యారు. 


ఈరోజు ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి మరో కొత్త కంటెస్టెంట్ యాడ్ అవ్వబోతున్నారు. అతడు మరెవరో కాదు.. బాబా మాస్టర్. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బాబా మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 


దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఆయన ఎంట్రీ ఇస్తున్నారంటే.. ఇక షోలో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరగడం ఖాయం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాబా మాస్టర్ 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు. మరి ఆ షోని వదులుకొని ఈ షోలోకి ఎలా వచ్చి ఉంటారనేది కొందరి అనుమానం. మొత్తానికి బాబా మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ షోపై బజ్ పెరుగుతుందేమో చూడాలి!


Also Read: 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ - ఎప్పుడు? ఎక్కడ?


Also Read: రామ్ సినిమాలో శింబు మాస్ సాంగ్