Sanjjanaa Galrani Reaction On Top 5 Finalist In Bigg Boss Telugu Season 9 : తాను జీవితంలో ప్రతికూల పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశానని హీరోయిన్ సంజనా గల్రానీ తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆమె ఎమోషనల్‌కు గురయ్యారు. తాజా ప్రెస్ మీట్‌లో తన బిగ్ బాస్ అనుభవాలను షేర్ చేసుకున్నారు.
'తెలుగు సినిమాలపై దృష్టి'
ఐదేళ్ల క్రితం తన ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని, కెరీర్‌ను ఓ కుదుపు కుదిపేసిందని చెప్పారు సంజనా. 'స్వతహాగా నేను ఓ ఫైటర్. ప్రతికూల పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను. ఒడుదొడుకుల్లో నాకు వెన్నంటి నిలిచిన నా ఫ్యామిలీ, ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు. బిగ్ బాస్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో కెరీర్‌లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నా.
నేను మళ్లీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ షోలో పాల్గొన్నాకు హోస్ట్ నాగార్జున సార్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఇకపై తెలుగు సినిమాలపై దృష్టి సారిస్తా. ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరూ గర్వపడేలా నడుచుకుంటా.' అని తెలిపారు.
Also Read : రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' - ఎలిజిబెత్‌లా హుమా ఖురేషీ... ఫస్ట్ లుక్ వచ్చేసింది
సంజన రెమ్యునరేషన్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' మూవీలో త్రిష చెల్లెలిగా నటించిన సంజన తన నటనతో మెప్పించారు. అదే క్రేజ్‌తో పలు సినిమాల్లో ఆమె నటించారు. తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. హౌస్‌లో కోడిగుడ్ల దొంగతనంతో వైరల్‌గా మారి నెటిజన్లకు చేరువయ్యారు. అలా టాప్ 5 విన్నర్స్ లిస్ట్‌లో చేరారు. టాప్ 4 రన్నర్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం ఆమె 15 వారాలు ఉన్నారు.
సంజనా రోజుకు రూ.40 వేల వరకూ రెమ్యునరేషన్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అలా దాదాపు రూ.42 లక్షల వరకూ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈసారి టాప్ 2లో తనూజ, కామనర్ పడాల కల్యాణ్ నిలవగా బిగ్ బాస్ విన్నర్‌గా కల్యాణ్ ట్రోఫీ అందుకున్నారు.