Huma Qureshi's Look Unvieled From Yash Toxic Movie : రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. రీసెంట్‌గానే ఈ మూవీ నుంచి హీరోయిన్ కియారా అడ్వాణీ లుక్ రిలీజ్ చేయగా... తాజాగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి లుక్ రివీల్ చేశారు మేకర్స్.

Continues below advertisement

ఖురేషీ రోల్ ఏంటంటే?

'టాక్సిక్' మూవీలో హుమా ఖురేషి ఎలిజిబెత్ పాత్రలో కనిపించనున్నారు. కారులో నుంచి క్వీన్ ఎలిజిబెత్ దిగి వచ్చిందా? అనేలా ఆమె లుక్ అదిరిపోయింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... KVV ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Continues below advertisement

హాలీవుడ్ స్థాయిలో మూవీని రూపొందిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ యష్, కిియారా లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. పెద్దలకు సందేశం ఇచ్చే చిత్రం కాగా... 'ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు. 

Also Read : నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏం ఉండాలి? - ఫ్యాన్ క్రేజీ క్వశ్చన్‌కు 'రాజా సాబ్' బ్యూటీ క్యూట్ ఆన్సర్

మార్చి 19న రిలీజ్

ఈ మూవీలో యష్‌తో పాటు కియారా అడ్వాణీ నటిస్తున్నారు. ఆమె నదియా పాత్రలో నటిస్తుండగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కరీనా కపూర్, శ్రుతి హాసన్, నయనతార పేర్లు తెరపైకి రాగా ఎవరు నటిస్తున్నారనే దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో మూవీ తెరకెక్కుతుండగా... హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరల్డ్ వైడ్‌గా మార్చి 19న రిలీజ్ కానుంది.